17 March, 2026 | 1:40 AM

ఏం తమాషాగా ఉందా?

03-11-2024 12:00 AM

దీపావళి పండుగ వేళ కథానాయిక మృణాల్ ఠాకూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. పండుగ నాడు ఓ నెటిజన్ ‘ది ఫ్యామిలీ స్టార్’ పోస్టర్‌ను ఎడిట్ చేశాడు. దీనిపై మృణాల్ ఫైర్ అయ్యారు. అసలేం జరిగిందంటే.. గత ఏడాది దీపావళికి సంబంధించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా పోస్టర్‌ను ఓ నెటిజన్ ఎడిట్ చేసి విజయ్ దేవరకొండ స్థానంలో తన ఫోటోను పెట్టి.. మృణాల్‌తో కలిసి టపాసులు కాలుస్తున్నట్టుగా ఫోజిచ్చాడు.

అంతటితో ఆగితే బాగానే ఉండేది. ‘దీపావళి ఫోటో ఎడిటింగ్.. బాలీవుడ్ నటి ఫోటో షూట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది కాస్త తాజాగా మృణాల్ కంట పడటంతో ఆమె ఫైర్ అయ్యారు. ‘ఏం తమాషాగా ఉందా? మీరు చేసిన పనేం బాగోలేదు’ అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం మృణాల్ బాలీవుడ్‌లో ‘పూజా మేరీ జాన్, సన్ ఆఫ్ సర్దార్ 2, తుమ్ హీ హో, హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రాల్లో నటిస్తున్నారు.