1 August, 2026 | 2:38 AM

బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం..?

01-08-2026 01:33 AM

కాలు ఫ్యాక్చర్తో వచ్చిన రోగికి వీల్చైర్ నిరాకరణ...

బాన్సువాడ, జూలై 31 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం పిట్లం మండలం సిద్దపూర్ గ్రామానికి చెందిన రమేష్ కాలు ఫ్యాక్చర్ కావడంతో తీవ్ర కాలు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన రోగికి వీల్చైర్ అందించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితడు ఆరోపించారు.

ఫ్యాక్చర్ కారణంగా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ రోగికి వెంటనే వీల్చైర్ ఏర్పాటు చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. పేరుకే పెద్ద ఆసుపత్రి ఇనప్పటికీ కనీస సౌకర్యాలు కూడా అందకపోవడం పట్ల రోగులు, వారి బంధువులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రి అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, అత్యవసర సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.