calender_icon.png 1 July, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాయిగూడెం హాస్పిటల్ కు వీల్ చైర్ అందజేత

30-06-2025 10:14:53 PM

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం వీల్ చైర్ అందజేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా స్వయంగా కొనుగోలు చేసి ఆసుపత్రికి అందించిన ఆయనను స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, మండల అధ్యక్షుడు సుబ్బల సమ్మయ్య, కావిరి చిన్ని కృష్ణ, మల్లారెడ్డి, తాడూరి రఘు, కూనూరి అశోక్, మండల నాయకులు పూజారి కిషోర్, మఠం వెంకటేష్, బిఆర్ ఎస్ పార్టీ యూత్ నాయకులు దుర్గం రాజేష్. చిలుముల రాంబాబు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మావూరి వెంకటయ్య, యూత్ నాయకులు నరెడ్ల అశోక్, సీనియర్ నాయకులు తొంగల రాంబాబు, జగన్, కావేరి నర్సింగరావు, జనగాం రవీందర్, కావేరి సంతోష్, జనగం లక్ష్మీపతి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.