calender_icon.png 1 July, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ..

30-06-2025 10:10:18 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): ఆర్థిక సంక్షోభం, అస్థిరతల మధ్య కూడా సంక్షేమ పథకాలను నిలకడగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అన్నారు. హనుమకొండ అంబేద్కర్ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 800 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ గుండు సుధారాణి, నగర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇలా అన్నారు. గత పాలకుల భాద్యతాహీన పాలన వల్ల ఆర్థికంగా దెబ్బతిన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మాత్రం తడబడలేదు.

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, ప్రతి పేద కుటుంబానికి మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3,500 ఇళ్లను కేటాయించగా, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కఠినమైనదై ఉన్నా ఇప్పటివరకు 2,000 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. మిగిలిన అర్హులు తమ వివరాలతో ప్రజాప్రతినిధులను లేదా సంబంధిత అధికారులను వెంటనే సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, గతంలో ఎన్నో దఫాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించినందుకు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

ఇందిరమ్మ ఇల్లు ద్వారా తమ కుటుంబానికి గౌరవభరితమైన జీవితం ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిసి రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సరళ సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఎనుకుంటి నాగరాజు, 58, 59, 60 డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, ఎనుకుంటి పున్నం చందర్, రవి కిరణ్, కాంగ్రెస్ నాయకులు మండల సమ్మయ్య, తాళ్లపల్లి విజయ్ కుమార్, తెల్లా సుగుణ కిషోర్, జనగాం శ్రీనివాస్, బుస నవీన్ కుమార్, మిడిదొడ్డి శేఖర్, మట్టపల్లి కమల్, పిట్టల వంశీ, పార్టీ నాయకులు, లబ్ధిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.