సంచార జాతులకు విముక్తి ఎప్పుడు?
గుండ్లపల్లి సత్యనారాయణ :
నేడు విముక్తి దినోత్సవం :
* క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ రద్దయి 73 సంవత్సరాలు గడిచినప్పటికీ.. సంచార జాతులు మాత్రం రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అనుభవించడంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా యి. ‘విముక్తి దినోత్సవం’ అనేది కేవలం కాగితం వరకే మిగిలిపోయింది. ఇది కేవలం చరిత్రలోని ఒక అధ్యాయం మాత్రమే కాదు. ఇప్పటికీ జరుగుతున్న సామాజిక అన్యాయం.
దేశవ్యాప్తంగా ఆగస్టు 31ని ‘విముక్త దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీ. ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు వేలాది సంచార జాతులపై ‘క్రిమినల్ ట్రైబ్స్’ అని ముద్ర వేశాయి. స్వాతంత్రం వచ్చినా కూడా ఈ వర్గం నిజమైన విముక్తిని పొందలేకపోతున్నాయి. ప్రస్తుతం వీరి ని ‘డీ- నోటిఫైడ్ ట్రైబ్స్’ (డీఎన్‌టీ) అని పిలుస్తున్నారు. వీరిపై పడ్డ ముద్ర, అవమా నం, అనుమానం మాత్రం ఇప్పటికీ వారి ని వెంటాడుతూనే ఉంది.
క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ రద్దయి 73 సంవత్సరాలు గడిచినప్పటికీ.. సంచార జాతులు మాత్రం రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అనుభవించడంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా యి. ‘విముక్తి దినోత్సవం’ అనేది కేవలం కాగితం వరకే మిగిలిపోయింది. ఇది కేవ లం చరిత్రలోని ఒక అధ్యాయం మాత్రమే కాదు. ఇప్పటికీ జరుగుతున్న సామాజిక అన్యాయం. వీరికి స్వేచ్ఛ అంటే ఇప్పటికీ స్వప్నమే, సమానత్వం అంటే ఇంకా చేరనిది, మానవ గౌరవం అంటే ఇప్పటికీ వీరికి అందని వరం.
తెలంగాణ రాష్ర్టంలోనూ ఈ సంచార జాతులు ఎదుర్కొం టున్న వాస్తవం బాధాకరం. ప్రతీ ఎన్నికల సమయంలో వారీ గూడాలకు, బస్తీలకు చేరే రాజకీయ నాయకులు హామీలు ఇస్తా రు. కానీ ఎన్నికలు పూర్తవగానే వారు మళ్లీ కనబడరు. విద్య, వైద్యం, ఉపాధి, వసతి ఇలా అన్నింటిలోనూ సంచార జాతులకు అవమానమే ఎదురవుతూ వస్తోంది.
నేరస్తులుగా ముద్ర..
భారత చరిత్రలో సంచార జాతులపై బ్రిటీష్ పాలనలో 1871 ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్’ అమల్లోకి రావడం వారికి మొదటి అన్యాయం. 1857 విప్లవం తర్వాత బ్రిటిష్ పాలకులకు విముక్త, సంచరా జాతులపై అనుమానం మొదలైంది. సంచార జాతు ల వర్గాలు స్వాతంత్ర సమరయోధులను ఆశ్రయించడంతో పాటు వారికి ఆహారం, రక్షణ ఇచ్చాయి. దీంతో ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్’ను తీసుకువచ్చారు. ఈ చట్టం ద్వా రా అనేక నిరపరాధ తెగలు, వర్గాలు జన్మ తః నేరస్తులుగా ముద్రించబడ్డారు.
1940 ల్లో స్వాతంత్రోద్యమం ఊపందుకున్నప్పు డు సంచార జాతులు కూడా జాతీయోద్యమకారులకి తోడుగా నిలిచారు. కానీ అదే సమయంలో వీరి మీద అనుమానం మ రింత పెరిగింది. ‘వీరే తిరుగుబాటు చేస్తా రు.. వీరే దోపిడీలకు తెగబడతారు’ అని బ్రిటిష్ వర్గాలు భావించాయి.
ఒక చోటు వదిలి ఇంకో చోటుకు వెళ్లాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి న పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో ఉన్నప్పటికీ, బ్రిటిష్ ప్రభావం గట్టిగానే ఉండేది. మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో సంచార జాతులు.. అక్కడి పోలీసులు, స్థానిక అధికారుల చేతుల్లో అన్యాయానికి గురయ్యాయి.
కాగితాలకే పరిమితం
1947లో స్వాతంత్రం సాధించినప్పుడు భారత ప్రజలు ‘ఇకపై అందరికీ సమాన త్వం, న్యాయం లభిస్తుందని’ ఆశించారు. ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో అన్యాయం గా క్రిమినల్ ట్రైబ్స్‌గా ముద్రపడ్డ సంచార జాతులు.. ఇకపై మనకూ సమాన హక్కు లు దక్కుతాయి అని ఆశపడ్డాయి. అయితే 1952లో ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్’ను రద్దు చేసినప్పటికీ ఆ వర్గాలను ‘డీ నోటిఫైడ్ ట్రైబ్స్’ అని పిలవడం ప్రారంభించారు.
స్వాతంత్య్రం తర్వాత అనేక కమిషన్లు సం చార జాతుల సమస్యలను గుర్తించినప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. మొదటగా 1949లో అనంతశయన అయ్యంగార్ నేతృత్వంలోని కమిటీ 1925 నుండి క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఆ తర్వాత 1953లో కాలెల్కర్ కమిషన్ సంచార జాతులను ప్రత్యేకంగా గుర్తించి, వారికి రిజర్వేషన్లు, విద్యా సదుపాయాలు ఇవ్వాలని సూచించింది.
కానీ ఆ సిఫార్సులు ఎక్కడా అమలు కాలేదు. ఇక 1979 లో మండల్ కమిషన్ దేశంలోని సామాజిక వెనుకబాటుతనంపై విశ్లేషణ చేసింది. సంచార జాతులలో చాలా కులాలను ఓబీసీల కింద చేర్చారు. కానీ వీరికి ఉన్న సం చార జీవనం, గుర్తింపు లోపం, పోలీసు వేధింపుల సమస్యలపై మాత్రం దృష్టి పెట్టలేదు. 2002లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ సంచార జాతుల కోసం ఆర్థిక, విద్య, ఉద్యోగ సృష్టి, సామాజిక స్వేచ్ఛ, పునరావాసం కోసం కార్యక్రమాలను, పథకాలను అమలు చేయాలని సూచించింది.
సంచార జాతుల కోసం 2006లో రేణుక కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దేశంలో సంచార జాతుల జనాభా సుమా రు 11 కోట్ల అని.. వీరి సంక్షేమం కోసం ప్రత్యక కమిషన్ ఏర్పాటు అవసరం ఉంద ని ఈ కమిషన్ సూచించినప్పటికీ రాజకీయ జోక్యంతో అది కాగితాలకే పరిమిత మైంది. 2018లో సంచార జాతులకు శాశ్వత కమిషన్ ఏర్పాటుతో పాటు అభివృద్ధి బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని బికురంజి ఇదాతే కమిటీ సూచించింది.
తెలంగాణలోనూ ప్రాధాన్యలేమి
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వా త, తెలంగాణలోనూ సంచార జాతులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వబడలేదు. అయితే మలిదశ ఉద్యమంలో స్వరాష్ర్ట సాధనకై సంచార జాతులు సైతం ఉద్యమించాయి. 2014లో తెలంగాణ రాష్ర్టం ‘సమానత్వం, అభివృద్ధి’ అనే నినాదాలతో ఏర్పడినప్పు డు సంచార జాతుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే స్వరాష్ట్రం వచ్చి దాదాపు పన్నెండు సంవత్సరాలు దాటినా సంచార జాతులు ఇంకా అత్యంత వెనుకబడిన వర్గాల జాబితాలోనే ఉన్నారు. మన రాష్ట్రంలో విముక్త సంచార, అర్ధ సంచార జాతుల కులాలు దాదాపు 70 నుంచి 75 ఉంటాయి.
వీరి జనాభా రాష్ర్ట మొత్తం జనాభాలో 8 నుంచి 10 శాతం ఉంటుందని అంచనా. కానీ బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం ఒక్కశాతం కంటే తక్కువే. రాష్ర్టంలో సం చార జాతుల కోసం బోర్డు లేదా కమిషన్ ఏర్పా టు చేయాలని కోరగా.. 2018 లో ఎంబిసి కార్పొరేషన్ పేరుతో సంచార జాతులలో ఫెడరేషన్ ఉన్న కులాలను పక్కనపెట్టి సం చార జాతులు ఐక్యతను దెబ్బతీసే విధానంతో గత ప్రభుత్వం ఇచ్చి న నిధుల కేటాయింపు కూడా కాగితాలకే పరిమితమయింది.
తెలంగాణలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, సంచా ర జాతుల పిల్లల స్థితి మాత్రం దయనీయంగా ఉంది. హాస్టల్ సదుపాయాల లోపం, పేదరికం కారణంగా సంచార జాతుల్లో పాఠశాలలకు వెళ్తున్న వారు తక్కువే. ఇతర కులాలు వీరితో సులభంగా సంబంధాలు పెట్టుకోకోపోవడం,
రోడ్డు పక్కన బిక్షాటన, వీధి కళలు, చిన్న పనులతోనే జీవనం, ఏ ప్రాంతంలో చోరీ జరిగినా, నేరం జరిగినా.. పోలీస్ అధికారులు ముందుగా వీరినే అనుమానితు లుగా భావిస్తుండడం బాధాకరం. వీరి సమస్యల పట్ల అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్‌లో మాట్లాడేవారు లేరు. పట్టణీకర ణ, గ్లోబలైజేషన్ వల్ల వీరి సంప్రదాయ వృత్తులు దాదాపు అంతరించిపోయాయి. కొత్త వృత్తులకు మారడానికి అక్షరాస్యత లేకపోవడం, నైపుణ్యాల లోపం వల్ల ఉపా ధి అవకాశాలకు దూరమవుతున్నారు.
అప్పుడే నిజమైన విముక్తి
మన దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా.. సంచారజాతులు ఇంకా స్వాతం త్య్రం రుచి చూడలేదు. తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లోనూ వీరి పరిస్థితి ఇదే. ఈ వర్గాల కోసం ప్రత్యేకంగా ఉద్యమించి వా రి ఆశలను నెరవేర్చినప్పుడే నిజమైన విముక్తి దినోత్సవం. సంచార జాతులకు విద్య, ఆరోగ్యం, గృహాలు, ఉపాధి.. ఈ నాలుగు రంగాల్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. వీళ్లకు ప్రత్యేక వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. విద్యా, ఉద్యోగాల్లో వీరికి 12 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరముంది. సంచార జాతులు నిజమైన గౌరవం, హక్కులు పొందినప్పుడే మన దేశానికి వచ్చిన స్వతంత్రం పరిపూర్ణమైనట్లు.
వ్యాసకర్త సెల్: 9440466194






