కాంగ్రెస్‌కు సవాల్‌గా ‘స్థానికం’
డాక్టర్ తిరునహరి శేషు :
తెలంగాణ రాష్ర్టంలో రెండో పర్యా యం స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ర్టం ఏర్పాటైన తర్వాత మొదటిసారి 2019లో స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికైన స్థానిక సంస్థలు ముఖ్యంగా గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసి 18 నెలల వుతున్నా స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల సమస్య ఒక కొలిక్కి రాకపోవటం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతుంది.
ఎన్నికల నిర్వహణ జాప్యంతో జోక్యం చేసుకు న్న తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుని రాష్ర్టంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రె స్, బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సహజంగానే స్థానిక సం స్థల ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయి.
కానీ స్థానిక నాయకత్వం, స్థానిక సమస్యలు కూడా ప్రధానంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అయితే 2023 శాసనసభ ఎన్నికల్లో గెలిచి మొదటిసారి అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిచి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తుంది.
గత 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి ఉన్న బలమైన పట్టుతో గెలుస్తామనే ధీమాని ఆ పార్టీ వ్యక్తం చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న కొన్ని సమస్యలు అ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయనే అనుమానాలు కూడా ఉన్నాయి.
ఆశల పల్లకిలో..
రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడానికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ కూడా ఒక కారణం. రిజర్వేషన్ల అంశం ఎటూ తేలక పోవటం వల న ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సాహసించడం లేదు. స్థానిక సంస్థల్లో బీసీలకి 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రూ పొందించిన బిల్లుపై రాష్ర్టపతి ఎలాంటి ని ర్ణయం తీసుకోకపోవడం, తెలంగాణ పం చాయతీరాజ్ చట్టం ప్రతిపాదించిన సవరణలు గవర్నర్ న్యాయ సల హా కోసం కేంద్ర హోం శాఖకు పంపడం తో రిజర్వేషన్ల విషయంలో రాష్ర్ట ప్రభు త్వం ముందుకెళ్లలేకపోతుంది.
బీసీలకు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వే షన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళితే కాం గ్రెస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రాజకీయంగా నష్టం చేస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. రిజర్వేషన్లకి బీజేపీ అడ్డుపడుతుందని ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అయినా తెచ్చేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమని హామీ ఇచ్చినప్పటికీ..
ఒకవేళ రిజర్వేషన్లు సాధించలేన ప్పుడు ఆ ప్రభావం కూడా హస్తం పార్టీపైనే ఎక్కువగా పడనుంది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం జీవో ఇచ్చి రిజర్వేషన్లు కల్పించాలని అనుకుంటే ఆ జీవో న్యాయస్థానాల ముందు నిలబడకపోగా సమస్య మరింత జటిలమయ్యే అవకాశం కూడా ఉంటుంది. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
యూరియా కొరత పార్టీకి నష్టమే!
స్థానిక ఎన్నికల ముందు అధికార కాం గ్రెస్‌కు యూరియా కొరత రూపంలో కష్టా లు మరింత రెట్టింపయ్యాయి. వ్యవసాయ పనులు ప్రారంభమైన ఈ సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో యూరియా దొరక్క రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. యూరియా బస్తాల కోసం ప్రాథ మిక సహకార కేంద్రాల వద్ద రైతులు బా రులు తీరి నిలబడినా యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. ఒక ఎకరానికి సగటున మూడు బస్తా ల యూరియా అవసరమవుతుంది.
కానీ ప్రభుత్వం ప్రతి రైతుకి రెండు బస్తాల కంటే ఎక్కువ యూరియా అందించకపోవడం తో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు నిలువలు (బఫర్ స్టాక్) పెట్టడంలో ప్రభుత్వ వైఫల్యం, యూరియా సర ఫరా ప్రణాళిక లేకపోవడం, యూరియా పక్కదారి పట్టి బ్లాక్ మార్కెట్‌కి వెళ్తు న్నా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం, కేం ద్రం నుంచి రైతుల అవసరాలకు సరిపడా యూరియా రాకపోవడం, రామగుం డం ఫెర్టిలైజర్ ఎరువుల సరఫరాలో రాష్ర్ట వాటాను పెంచుకోలేకపోవటం, ప్రతి సం వత్సరం లక్ష మెట్రిక్ టన్నుల యూరియా అవసరాలు పెరుగుతున్నా..
పెరిగిన అవసరాల మేరకు యూరియా సరఫరా లేక పోవడం వల్ల రైతుకి 270 రూపాయలకు అందాల్సిన యూరియా బస్తా బ్లాక్ మార్కెట్‌లో 400 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. రైతుల యూరియా కష్టాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ పడే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైతు రుణమాఫీ చేసినా గత ప్రభుత్వం లాగా రైతు భరోసా నిధులు అందించకపోవడం, 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి 12 వేల రూపాయలకు రైతు భరోసాను కుదించడం కూడా రైతుల్లో ప్రభుత్వంపై అసం తృప్తి వ్యక్తమయ్యేలా చేసింది.
నిరుద్యోగుల అసంతృప్తి
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఓటమిలో నిరుద్యోగుల పాత్ర చాలా కీలకమైనది. ప్రభు త్వ ఉద్యోగాల భర్తీలో, నోటిఫికేషన్ విడుదలలో జాప్యం, ప్రశ్నాపత్రాల లీక్ లాంటి ఘటనల వల్ల బీఆర్‌ఎస్ ఓటమిని చేజేతు లా కొని తెచ్చుకుందనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ రాష్ర్టంలో అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ.. ఇవన్నీ గత ప్రభు త్వం విడుదల చేసిన నోటిఫికేషన్లే అన్న విషయం మరవద్దు.
కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వటం లేదని, జాబ్ క్యాలెండర్ ప్రకారం గా నోటిఫికేషన్ విడుదల కావడం లేదనే అసంతృప్తి నిరుద్యోగుల్లో ఎక్కువైపోయిం ది. 2022 మార్చిలో అసెంబ్లీ సాక్షిగా రాష్ర్టంలో 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామని నాటి ముఖ్య మంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు.
కానీ ఇప్పటివరకు ఆ 80 వేల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేకపోయారనే ప్రశ్నలకు ఈ ప్రభుత్వం వద్ద కూడా సమాధానం లేకుండా పోయింది. నిరుద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లకక్కుతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం కలిగించే అంశాన్ని కూడా తోసిపుచ్చలేం.
ప్రతిపక్షాల బలహీనతే -బలమా!
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అనుకూలత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై లేదనే చెప్పాలి. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఇంకా బలంగా కనప డ టానికి కారణం ప్రతిపక్షాలు ఆశించిన స్థాయిలో బలపడకపోవడమే. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్ తన ప్రతికూలతలను అధిగమించి బలమై న ప్రతిపక్షంగా నిలదొక్కుకోవడంలో విఫలమవుతోంది. మరోవైపు గ్రామీణ ప్రాం తాల్లో ఇప్పటికీ బీజేపీ బలమైన శక్తిగా ఎదగకపోవడం స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్‌కి కలిసివచ్చే అంశంగా కనబడుతుంది.
ఇటీవల కాలంలో రాష్ర్టంలో బీజేపీ బలం గణ నీయంగా పెరిగినప్పటికీ.. ఆ పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు, బీసీలకు రాష్ర్ట అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం బీజేపీకి నష్టం కలిగిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క కేసులు, కమీష న్లు, అవినీతి ఆరోపణలు, పార్టీలో అంతర్గత సమస్యలు అటు బీఆర్‌ఎస్‌ను ఇబ్బం ది పెట్టడం.. కాంగ్రెస్ అధికారంలో ఉండ టం ఆ పార్టీకి కొంత అనుకూలం. అయితే ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని, పార్టీలోనూ, రాష్ర్టంలోనూ ఉన్న సమస్యలను అధిగమించి కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఏ స్థాయి విజయం సాధిస్తుందో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
వ్యాసకర్త సెల్: 9885465877






