2 June, 2026 | 7:19 PM

Breaking News

ఎమ్మెల్యేను అవమానపరచలేదు   •   కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •   బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •  

తులం బంగారం ఎప్పుడిస్తారు?

08-04-2026 12:00 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

వాంకిడి/ జైనూర్/ సిర్పూర్ యు, ఏప్రిల్ 7(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 64 మందికి, జైనూర్ మండలంలో 14 మందికి, సిర్పూర్ (యూ) మండల కేం ద్రంలో 31 మందికి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి పథకం కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తులం బంగారం హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

జైనూర్ మండల కేంద్రంలోని జైనూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో వాం కిడి, జైనూర్, సిర్పూర్ (యూ) మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.