టీజీ20 లీగ్‌కు అనుమతులెక్కడ?
హెచ్‌సీఏకు టీసీఏ ప్రశ్నలు
హైదరాబాద్, జూన్ 5 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీజీ20 లీగ్ నిర్వహణపై తెలంగాణ క్రికెట్ అసోసియే షన్ (టీసీఏ) మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. బీసీసీఐ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఈ లీగ్‌ను నిర్వహి స్తున్నారని ఆరోపించిం ది. బీసీసీఐ అనుమతులు ఉన్నాయని హెచ్‌సీఏ చేస్తు న్న ప్రచారాన్ని సవాల్ చేస్తూ టీసీఏ అధికారిక పత్రాలను విడుదల చేసింది.
హెచ్‌సీఏ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న జస్టిస్ పి.నవీన్ రావు (రిటైర్డ్), హెచ్ సీఏ కార్యదర్శి ఎ. జీవన్ రెడ్డిలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు టీసీఏ తెలిపింది. ”కోర్టులు ఆధారాల ఆధారంగానే నిర్ణయా లు తీసుకుంటాయి. 2018లో బీసీసీఐ తెలంగాణ ప్రీమియర్ లీగ్‌ను అనధికార టోర్న మెంట్‌గా పేర్కొన్న నేపథ్యంలో, అదే ప్రతిపాదనకు పేరు మార్చి టీజీ20గా నిర్వహి స్తుంటే, దానికి ప్రత్యేకంగా బీసీసీఐ నుంచి ఏ అనుమతి లభించిందో హెచ్‌సీఏ బహిరంగంగా వెల్లడించాలనీ టీసీఏ ప్రధాన కార్యద ర్శి ధరం గురువారెడ్డి డిమాండ్ చేశారు.
అలాగే, రాష్ట్ర క్రికెట్ సంఘాలు నిర్వహించే వాణిజ్య లీగ్‌లు తప్పనిసరిగా బీసీసీఐ నియమాలు, రాజ్యాంగం, జనరల్ బాడీ ఆమోదం మరి యు పారదర్శక ప్రక్రియలకు లోబడి ఉండాలని టీసీఏ స్పష్టం చేసింది. బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వ్యవహారాలు, తెలంగాణ క్రికె ట్ భౌగోళిక అధికార పరిధిపై కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో టీజీ20 నిర్వహణపై స్పష్ట త అవసరమని పేర్కొంది.
పూర్తి నియంత్రణ అనుమతులు, అధికారిక రికార్డులు బహిర్గతం కాకుండా ఆటగాళ్ల వేలం, ఫ్రాంచైజీ ప్రక్రియలు కొనసాగించడం వల్ల ఆటగాళ్లు, పెట్టుబడిదారులు, స్పాన్సర్లు, జట్టు యజమానులు భవిష్యత్తులో చట్టపరమైన, ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని టీసీఏ హెచ్చరించింది. ఐదు రోజుల్లో హెచ్‌సీఏ టీజీ20 లీగ్‌కు సంబంధించి అనుమతి పత్రాలను చూపించకుంటే చట్టప రంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.






