18 March, 2026 | 4:49 AM

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల స్కీమ్ ఎక్కడ?

18-03-2026 12:00 AM
  1. ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నేతల నిరసన
  2. ముషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి 

ముషీరాబాద్, మార్చి 17(విజయక్రాంతి): కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చి ఆ గ్యారంటీలను విస్మరించిందని బీజేపీ పలువురు నేతలు ఆరో పించారు. ఈ మేరకు మంగళవారం  ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి ఎం.  రమేష్ రామ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల స్కీమును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముషీరాబాద్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం డిప్యూటీ తాహసి ల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఎం. రమేష్ రామ్, ఏ. వినయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ టి రవీందర్, సలంద్రి శ్రీనివాస్ యాద వ్‌లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ప డి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ఆరు గ్యారెంటీల స్కీమ్ అమలు ఎక్కడా అని వారు ప్రశ్నించారు. అర్హులైన ప్రజలు సంక్షే మ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ది చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటీ ల స్కీములు అర్హులైన ప్రజలకు ప్రయోజనాలు చేకూరడం లేదన్నారు. పథకాలు ప్రారంభించిన సరైన విధంగా ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ కారిక్రమంలో కవాడిగూడ, అడిక్మెట్ డివిజన్ల బీజేపీ అధ్యక్షులు సలంద్రి దిలీప్ యాదవ్, సాయి కృష్ణ యాద వ్, సురేష్ ముదిరాజ్, నందగిరి నరసింహ, శక్తి సింగ్ తదితరులు పాల్గొన్నారు.