14 June, 2026 | 4:35 PM

Breaking News

భోజన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి   •   ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం   •   ఆలయ నిర్మాణకు విరాళం అందజేత   •   ఎమ్మెల్యే అనుచర వర్గంపై దృష్టి పార్టీ పటిష్టతపై ప్రత్యేక సమావేశాలు.   •   అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •  

కేసీఆర్ ఎక్కడ?

04-09-2024 01:28 AM
  1. వరద బాధితులకు అండగా ఉంటాం 
  2. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్  

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): భారీ వర్షాలతో రాష్ట్రం అతలా కుతలం అవుతుంటే.. బాధ్యతగల ప్రతిపక్షనేత కేసీఆర్ ఎక్కడున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కష్టకాలంలో ప్రజలకు భరోసానివ్వాల్సిన మాజీ సీఎం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యాంటూ విమర్మలు గుప్పించారు. మంగళవారం ఆయన గాంధీభవ న్‌లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వరద బాధితులను ఆదుకోవడానికి అన్నీ విధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు.  బీఆర్‌ఎస్ నేతలు బురద రాజకీయాలు మానుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రాజ్‌భవన్ ముందు ఉన్న ఎంఎస్ మక్తా నీట మునిగినా కేసీఆర్ గడపదాటి బయటికి రాలేదన్నారు.  ఏపీలో బాధ్యతగల ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజలకు అండగా నిలబడ్డారని తెలిపారు.