మంచి చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి.. అందరి మదిలో పదిలంగా ఉండేలా సేవ చేస్తా..
నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్ నగర్, మార్చి 29 (విజయక్రాంతి): మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందని నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రజక సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భగవంతుడు తమకు అవసరమైన సదుపాయాలు అన్ని కల్పించడం జరిగిందని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడుతూ సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు.
ఎంతమంది ఎన్ని ఆరోపణలు పూలుకున్న నగరమును మరింత అభివృద్ధి చేస్తూ అడుగులువెళ్దామని సూచించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి దేంగా అడుగులు వేస్తున్నారని వారి సూచనలు సలహాలను తీసుకుంటూ కంకణ బద్ధులమై పనిచేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు వీరన్నపేట లోని 32వ డివిజన్లో చత్రపతి విగ్రహాన్ని నిర్మించనున్న కా ర్యక్రమానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల వెంకటేష్, జాతీయ అధ్యక్షుడు నడిపింటి శ్రీనివాస్ రాజక సంఘం అధ్యక్షుడు దుర్గేష్, బాలరాజు, సాయిలు, పాండు, వెంకటయ్య, గంగయ్య, మహేష్, కిషోర్, యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




