22 May, 2026 | 10:27 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

హాకీ ఇండియా లీగ్: ఫైనల్ వెళ్లేదెవరు?

30-01-2025 10:15 PM

సెమీస్‌లో సుర్మాతో తుఫాన్స్, బెంగాల్‌తో డ్రాగన్స్ అమీతుమీ

రూర్కెలా: హాకీ ఇండియా లీగ్(Hockey India League) తుది అంకానికి చేరుకుంది. రేపు జరగనున్న తొలి సెమీఫైనల్లో సుర్మా హాకీ క్లబ్‌తో హైదరాబాద్ తుఫాన్స్, రెండో సెమీస్‌లో బెంగాల్ టైగర్స్‌తో తమిళనాడు డ్రాగన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశలో బెంగాల్ టైగర్స్ 19 పాయింట్లతో పట్టికలో టాప్‌లో నిలవగా.. సుర్మా రెండో స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ తుఫాన్స్, తమిళనాడు చెరో 18 పాయింట్లతో సమానంగా నిలిచినప్పటికీ గోల్స్ ఆధారంగా మూడు, నాలుగో స్థానాలు దక్కించుకున్నాయి. బెంగాల్ టైగర్స్‌కు జుగ్‌రాజ్ సింగ్ (9 గోల్స్) కీలకం కానున్నాడు. ఇక సుర్మా క్లబ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రాణింపుపైనే జట్టు విజయం ఆధారపడి ఉంది. ఇక హైదరాబాద్ తుఫాన్స్‌కు మాత్రం విదేశీ ఆటగాళ్లు టిమ్ బ్రాండ్, గొంజాలో పెల్లట్‌లు వెన్నుముకలా నిలుస్తున్నారు. తమిళనాడు డ్రాగన్స్ తరఫున జిప్ జానసెన్ ఆరు గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అయితే లీగ్ దశలో బెంగాల్ 1 తమిళనాడు చేతిలో ఓటమి చవిచూడగా.. తుఫాన్స్‌తో మ్యాచ్‌ను సుర్మా 1 డ్రా చేసుకుంది. అయితే షూటౌట్‌లో తుఫాన్స్ 4 సుర్మాపై విజయం సాధించింది.