12 July, 2026 | 1:13 AM

రీయింబర్స్‌మెంట్ రద్దుకు కుట్ర!

12-07-2026 12:41 AM
  1. ప్రభుత్వానికి మూసీ సుందరీకరణ ముఖ్యమా?
  2. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 
  3. గవర్నర్‌కు వినతి

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో 14 లక్షల మంది పేద విద్యార్థుల చదువుల కంటే రాష్ట్ర ప్రభుత్వానికి మూసీ సుందరీకరణే ముఖ్యమైపోయిందని, ఫీజుల బకాయిలు 7వేల కోట్లు ఇవ్వలేని ప్రభుత్వం, మూసీ సుందరీకరణకు మొదటి దశలో 7,345 కోట్లు విడుదల చేసిందని బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో లోక్ భవన్‌లో భేటీ అయింది.

రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన డిమాండ్‌లతో కూ డిన వినతి పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. పాత పద్ధతి ప్రకారమే ఫీజుల రీయింబర్స్‌మెంట్ అమలు చేసేలా, గత నాలుగు సం వత్సరాలుగా 7 వేల కోట్లు ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెం ట్ పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.

ఒకవైపు ప్రభుత్వం నుండి ఫీజు రియంబర్స్మెం ట్ నిధులు రాక, ఇంకొక వైపు కళాశాల య జమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వక, పరీక్షలు రాయనీయక, కోర్సు పూర్తి చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వేలాది మంది వి ద్యార్థులు ఉన్నత విద్య నుండి మధ్యలోనే వదిలేసి మళ్లీ కులవృత్తులలో మగ్గిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . విద్యా ర్థులకు జరుగుతున్న అన్యాయాలను గవర్నర్ సావధానంగా విని, బీసీ నేతలు చెప్పిన ప్రతి విషయంపై సెక్రటరీ దాన కిషోర్ ద్వారా తెలుసుకొని సానుకూలంగా స్పందించారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీసీ నేతులు ఉన్నారు.