వస్త్ర పరిశ్రమకు ఊతం
- 10న కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
- టెక్స్‌టైల్ హబ్‌గా మారనున్న పార్కు
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో దేశ వస్త్ర పరిశ్రమ రంగానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మరీముఖ్యంగా.. వరంగల్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్న ‘పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు’ను తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ 10వ తేదీన పారంభించనున్నారని శనివారం ప్రకట నను విడుదల చేశారు.
అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నిర్మించిన ఈ పార్కు.. టెక్స్‌టైల్ హబ్‌గా మారనుందన్నారు. ఈ పార్కు ద్వారా వస్త్ర ఉత్పత్తి, ఎగుమతులు మరింతగా వృద్ధి చెందనున్నాయని, దీంతోపాటుగా ఉపాధి అవకా శా లు పెరుగుతాయని పేర్కొన్నారు. ‘ఫామ్ టు ఫైబర్’, ‘ఫైబర్ టు ఫ్యాక్టరీ’, ‘ఫ్యాక్టరీ టు ఫ్యాషన్’, ‘ఫ్యాషన్ టు ఫారిన్’ అనే ప్రధాని మోదీ 5ఎఫ్ విజన్‌ను ఈ మెగా టెక్స్ టైల్ ప్రతిబింబించనుందని వెల్లడించారు.
రూ.1,695.54 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రూ.6 వేల కోట్ల పెట్టుబడు లు వస్తాయని అంచనా.. ఇప్పటికే రూ. 3,800 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. 1,327 ఎకరాల్లో విస్తరించిన ఈ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ అన్నారు. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్ర) పథకం కింద బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా ఎంపికైందన్నారు.






