25 August, 2026 | 2:34 AM

ఆ చిన్నారుల గోస పట్టించుకునేదెవరు?

25-08-2026 01:36 AM
  1. పాఠశాలలో ఎంపీడీవో కార్యాలయం.. చదువు సాగేదెట్ల
  2. చిన్నారులు ప్రశ్నించరనే.. కార్యాలయం తరలించట్లేదా?
  3. యేండ్ల తరబడి పాఠశాల భవనం ఉపయోగిస్తే ఎట్లా!
  4. ఆఫీస్ కార్యాలయంలోను విద్యాబోధన చేస్తున్న వైనం
  5. మా భవనాలు మాకు ఇవ్వండి సార్ అంటూ వేడుకోలు 

మహమ్మదాబాద్ ఆగస్టు 24 : అ ఆ...ఇ ఈ అంటూ పలక బలపం పట్టుకుని దిద్దుతున్నామని అలుసా..ఈ పిల్లల చదువుకుంటున్న గదులు తీసుకుంటే ప్రశ్నించరు.. అనుకుంటున్నారా? ఎన్ని రోజులు పాఠశాల భవనం వాడుకున్న రోడ్డెక్కి నిరసన తెలుపరని...ఏండ్ల తరబడి మేము చదువుకునే భవనాన్ని కార్యాలయానికి ఉపయోగిస్తే ఎట్లా అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు.  ఒక విద్యార్థి చదువు కోసం ఏళ్ల తరబడి రైలు నడిపిన అరుదైన అంశం అందరి మదిలో ఉంది.

ఇక్కడ ఒక్క విద్యార్థి కాదు ఆ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనేది ఆ సందర్భం. మహమ్మదాబాద్ మండలం కేంద్రం నూతనంగా గత రెండేళ్ల క్రితం అంకురార్పణ  చేసి  ఎంపీడీవో కార్యాలయం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీడీఓ కార్యాలయంకు శాశ్వత భవనం కు అడుగులుపడడం లేదని తెలుస్తుంది. విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న పాఠశాల భవనంలో ఎంపీడీవో కార్యాలయం ఏర్పాటు చేసి ఆ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి  అవుతున్నారు.

ప్రధానోపాధ్యాయిని గదిలో కూడా విద్యార్థులకు విద్యాబోధన నేర్పిస్తూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా చదువులకు ఆటంకం కలగకుండా భవనం ఖాళీ చేసి అద్దె భవనంలోకైనా మరేదైనా భవనంలోనైనా కార్యాలయం నిర్వహించాలని విద్యార్థులు చెబుతున్న మాట. 

ఆందోళన చేయమనే కదా మా భవనం మాకు ఇస్తలేరు..

చిన్నారులం.. కాస్త గట్టిగా మాట్లాడిన కోపంగా చూసిన ఉన్నట్టుండి అప్పుడే భయపడతాం.. ఇక్కడ కూర్చుంటే పెద్దవారు మరోసారి చెప్పేంతవరకు అక్కడే కూర్చుంటాం.. తప్పు ఒప్పు తెలియని చిన్న వయసు మాది. మేము హల్లాదకరమైన వాతావరణంలో చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వం మాకు భవనాలు ఏర్పాటు చేస్తే ఆ భవనంలో పెద్దసారాలు కార్యాలయం ఏర్పాటుచేసి ఏళ్ల తరబడి మాకు ఇవ్వకుంటే మేము ఎలా చదువుకోవాలి.

ఆందోళన చేస్తాం.. ధర్నాలు, చేస్తేనే మా భవనం మాకు ఇస్తామంటే ఎట్లా? రోడ్డు దాటేందుకే కూడా మాకు భయంగా ఉంటుంది.. నిరసనలు చేయమని మా భవనాన్ని ఇన్నేళ్లపాటు వాడుకుంటూ మాకు ఇబ్బందులు గురి చేస్తుండ్రు. ఇకనైనా ఎంపీడీవో కార్యాలయాన్ని మా పాఠశాల నుంచి తరలించి మాకు మేలు చేయాలని విద్యార్థులు వేడుకుంటుండ్రు. 

ప్రైవేట్ భవనంలోకి మారిస్తే తప్పేముంది..?

 పాఠశాలను ఇతర ప్రాంతానికి మార్చే అవకాశాలు లేవు. పాఠశాల లో చదువుకున్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన అధికార యంత్రం పాఠశాల భవనంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు.

ఎంపీడీవో కార్యాలయం ఏర్పాటుకు ప్రైవేటు భవనాలు తీసుకోవలసిన అవకాశం ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని తీసుకొని విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులకు గురి చేస్తూ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యార్థులు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని శాశ్వత భవనాలు నిర్మాణమా? అద్దె భవనాలకు తరలించడమా? అనే కోణాల్లో పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

ఇబ్బందిగా ఉంది..

చాలా ఇబ్బంది గా ఉంది. పాఠశాలలో విద్యార్థుల కు మరిన్ని గదులు అవసరం. పాఠశాల కోసం నిర్మించిన భవనం తిరిగి కేటాయిస్తే బాగుంటుంది. విద్యార్థులకు మేలు జరుగుతుంది.                   

విస్లావత్ విఠల్ నాయక్, ప్రధానోపాధ్యాయులు, మహమ్మాదాబాద్