14-01-2026 02:07:55 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృ ష్టించిన మహిళా ఐఏఎస్ ఆఫీసర్‌ను కించపరిచే కథనాలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోల మార్ఫింగ్ వ్యవహారాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఈ రెండు కేసులను సమగ్రంగా విచారించేందుకు డీ జీపీ శివధర్‌రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృం దాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. మొత్తం ఎనిమిది సభ్యు లు ఉంటారు.
గత కొద్దిరోజులుగా కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడి యా హ్యాండిల్స్ ఒక మహిళా ఐఏఎస్ అధికారిని లక్ష్యంగా చేసుకుని ఆమెను కించప రిచేలా వరుస కథనాలు ప్రచురించాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ హై దరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు నారాయణపేట జిల్లా మద్దూరులో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన కలకలం రేపింది.
తెలంగాణ పబ్లిక్ టీవీ అనే వాట్సాప్ గ్రూపులో కావలి వెంకటేశ్ అనే వ్యక్తి సీఎం ఫొటోలను అసభ్యంగా పోస్ట్ చేశారంటూ కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 11న కేసు నమోదైంది. ఈ రెండు కేసులను డీజీపీ శివధర్‌రెడ్డి సిట్‌కు అప్పగించారు. సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌లో శ్వేత (నార్త్ జోన్ జాయింట్ సీపీ), యోగేశ్ గౌతమ్ (చేవెళ్ల డీసీపీ), వెంకట లక్ష్మి (హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ),
అరవింద బాబు (సైబర్ క్రైమ్స్ డీసీపీ), ప్రతాప్ (విజిలెన్స్ అదనపు ఎస్పీ), గురు రాఘవేంద్ర (సీసీఎస్ ఏసీపీ), శంకర్‌రెడ్డి (సైబర్ సెల్ సీఐ), హరీశ్ (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్‌ఐ) ఉన్నారు. ఈ కేసుల దర్యాప్తును జాప్యం లేకుండా పూర్తి చేయడమే లక్ష్యంగా సిట్‌కు ఆదేశాలు అందాయి. సాంకేతిక ఆధారాలను సేకరించి, నిందితులపై బలమైన సాక్ష్యాలతో త్వరలోనే న్యాయస్థానంలో ఛార్జిషీట్లు దాఖ లు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు.