calender_icon.png 14 January, 2026 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజా విక్రేత అరెస్ట్

14-01-2026 02:10:44 AM

ఉప్పల్ జనవరి 13విజయక్రాంతి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజను విక్రయిస్తే చర్యలు తప్పవని నాచారం క్రైమ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి లోని ఓల్డ్ మల్లాపూర్ చైనా మాంజా విక్ర యాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు సిబ్బందితో ఓల్డ్ మల్లాపూర్‌లో ఉన్న దుకాణాలపై దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో మహమ్మద్ గౌస్ (65) అనే వ్యక్తి నుండి 25 మాంజా బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మాంజా అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలుతప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకటేష్ రాహుల్ ఎలిజా సత్యనారాయణ రాములు పాల్గొన్నారు.