6 July, 2026 | 4:22 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

హార్డ్ డిస్క్‌ల ధ్వంసం సూత్రధారి ఎవరు?

13-06-2025 12:00 AM
  1. ప్రణీత్‌రావు ఇప్పటికే అప్రూవర్
  2. ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావును కలిపి సిట్ ప్రశ్నించే అవకాశం?

హైదరాబాద్,సిటీ బ్యూరో జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఇటీవల అమెరికా నుంచి తిరిగివచ్చిన ఏ1 నిందితుడు ప్రభాకర్‌రావును ఇప్పటికే ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించింది. ఎస్‌ఐబీకి సంబంధించిన హార్డ్ డిస్క్‌ల ధ్వంసంపై ఈ వారంలోనే సిట్  ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావును కలిపి ఒకేసారి విచారించే అవకాశం ఉంది.

ఇద్దరినీ కలిపి ఒకేసారి విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు లోకి వస్తాయిన సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసినట్లు ఇప్పటికే ప్రణీత్‌రావు అంగీకరించగా, ఎవరి ఆదేశాల మేరకు ఆ హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారనే అంశంపై సిట్ విచారణ చేపట్టనున్నది.

అలాగే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు మధ్య సంబంధాలు, హార్డ్ డిస్క్‌ల ధ్వంసంలో ఎవరి పాత్ర ఎంత.. అనే అంశంపై లోతైన అధ్యయనం చేయనున్నది. ఇదంతా పూర్తయితే త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కుట్ర వెనుక ఉన్న రహస్యాలన్నీ వెలుగులోకి వస్తాయని విశ్వసనీయమైన సమాచారం.