6 July, 2026 | 3:26 PM

Breaking News

విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

విద్యతోనే సమాజాభివృద్ధి..

12-06-2025 11:51 PM

బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్(MLA Muta Gopal) అన్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత  తల్లిదండ్రులపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ, ముషీరాబాద్, గాంధీనగర్ డివిజన్ లలో కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్, రచన శ్రీ లతో కలిసి ఆయన బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ... విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ముఖ్యంగా డ్రాప్ ఓటు పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్, డ్రెస్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.