25 February, 2026 | 9:19 AM

వేటు ఎవరిపై?

25-02-2026 12:00 AM

* టీ20 ప్రపంచకప్‌లో ఒక్క ఓటమితో భారత్ బొమ్మ తలకిందులైంది. టైటిల్ ఫేవరెట్.. తిరుగులేదు.. కప్ మనదే అనుకుంటున్న వేళ సౌతాఫ్రికాతో పరాజయం గట్టి దెబ్బ కొట్టింది. సహజంగానే ఓటమి ఎదురైన తర్వాత జట్టు లోపాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ లోపాలను అధిగమించడంపైనే టీమిండియా ఫోకస్ పెట్టింది.

పనిలో పనిగా తుది జట్టు కూర్పులోనూ కీలక మార్పులకు సిద్ధమైంది. జింబాబ్వేతో మ్యాచ్‌కు సంజూ శాంసన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సుంది. దీంతో తిలక్ వర్మపై వేటు పడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అక్షర్ పటేల్ కూడా రానుండడంతో వాషింగ్టన్ సుందర్‌ను తప్పించనున్నారు.

  1. జింబాబ్వేతో కీలక మ్యాచ్
  2. భారత తుది జట్టులో మార్పులు
  3. తిలక్ వర్మ స్థానంలో సంజూ ?
  4. అక్షర్ పటేల్ రీఎంట్రీ
  5. రింకూ ప్లేస్‌లో కుల్దీప్

చెన్నై, ఫిబ్రవరి 24: మొన్నటి వరకూ టైటిల్ రేసులో ముందున్న టీమిండియా ఇప్పుడు సూపర్ 8 స్టేజ్‌ను దాటేందుకు ఆపసోపాలు పడుతోంది. కేవలం ఒకే ఒక్క ఓటమి ఈ పరిస్థితికి కారణమైంది. సౌతాఫ్రికాతో చిన్న మార్జి న్‌తో ఓడినా పెద్ద సమస్య ఉండేది కాదు. అయితే 76 పరుగుల తేడాతో పరాజయం పాలవడం రన్‌రైట్ మైనస్‌లోకి వెళ్లిపోయిం ది. ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ మంచి రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంది.

అదే సమయంలో మిగిలిన జట్ల సమీకరణాలు కూడా కలిసి వస్తే భారత్ సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్‌కు భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఫైనల్ ఎలెవెన్‌లో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోం ది. ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చాలని పలువురు సూచిస్తున్నారు. వరుస వైఫల్యాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న అభిషేక్ శర్మను తప్పించాలన్న డిమాం డ్ వినిపిస్తోంది.

ఒకటిరెండు ఫెయిల్యూర్స్‌కే సంజూ శాంసన్‌ను తప్పిం చిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జింబాబ్వేతో మ్యాచ్‌కు అభిషేక్‌ను తప్పించి సంజూ శాంసన్‌ను తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై భారత అసిస్టెంట్ కోచ్ కూడా స్పందించాడు. సంజూను తుది జట్టులోకి తీసుకునే విషయంలో చర్చిస్తామని చెప్పాడు. అయితే మేనేజ్‌మెంట్‌కు మరో ఆ లోచన కూడా ఉంది. తిలక్‌వర్మ పేలవ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది.

దీంతో తిలక్‌ను తప్పించి మూడో స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించే అవకాశాలనూ పరిశిలీస్తోంది. దీని ప్రకారం చూస్తే అభిషేక్ శర్మ ఓపెనింగ్ స్థానానికి ఢోకా లేనట్టే. అయితే జింంబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్ మెరుపులు మెరిపించకుంటే మాత్రం కష్టమే. ఇదిలా ఉంటే రింకూ సింగ్‌ను సైతం పక్కన పెట్టే  అవకాశాలున్నా యి. అతని స్థానంలో చెన్నై పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని కుల్దీప్ యాదవ్‌ను తీసుకుంటారని భావిస్తున్నారు. రింకూ పలు అవకాశాలిచ్చినా విఫలమయ్యాడు. 

ఫినిషర్ రోల్‌లో అదరగొడతాడనుకుంటే రింకూ తనకిచ్చిన అవకాశా లను వృథా చేసుకుంటున్నాడు.  మరోవైపు తుది జట్టు నుంచి అక్షర్ పటేల్‌ను ఎందుకు తప్పిస్తున్నారనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాషింగ్టన్ సుందర్ కంటే ఆల్ రౌం డర్‌గా అక్షర్ మంచి ప్లేయర్ అనేది అందరికీ తెలుసు. అలాంటప్పుడు మెగాటోర్నీ మధ్యలో అది కూడా కీలకమైన సూపర్ 8లో ప్రయోగా లు ఎందుకు చేస్తున్నారనేది చర్చకు దారితీసింది. 

ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌కు అక్షర్‌పటేల్ తుది జట్టులోకి రావడం ఖాయం. అక్షర్‌పటేల్ బ్యాట్‌తోనూ ఉపయోగపడతాడు కాబట్టి రింకూపై వేటు పడినా పెద్ద ఇబ్బందులేమీ ఎదురుకావు. మొత్తం మీద జింబాబ్వేతో మ్యాచ్‌కు రెండు మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

ఇక ప్రధాన బ్యాటర్లందరూ పూర్తి ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాం డ్యా రాణించకుంటే విజయంపై ఆశలు పెట్టుకోలేం. కాగా టీమిం డియా సెమీస్ రేసులో నిలవాలంటే జింబా బ్వే, వెస్టిండీస్ జట్లపై భారీ విజయాలను అందుకోవాలి. అప్పుడే మైనస్‌లో ఉన్న రన్‌రేట్ మెరుగై సెమీఫైనల్ బెర్తు దక్కే అవకాశముంటుంది.