23 June, 2026 | 11:21 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఇంటర్ పరీక్షకు 96.90 శాతం హాజరు

26-02-2026 12:43 AM
  1. తొలి రోజు 15,903 మంది గైర్హాజరు
  2. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఇంటర్ బోర్డు కార్యదర్శి
  3. నేడు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాం తి): ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇ ంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వెజ్ (సెట్--బీ ప్రశ్నపత్రం) పరీ క్షను నిర్వహిచారు. 5,14,598 విద్యార్థులకు గానూ 4,98,695 మంది విద్యార్థులు పరీక్ష కు హాజరుకాగా 15,903 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా 96.90 శా తం మంతి విద్యార్థులు పరీక్ష రాశారు. ఎ లాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలే దని ఇంటర్ బోర్డు తెలిపింది. 5 నిమిషాల గ్రేస్ పిరియడ్ (ఆలస్యంగా వచ్చినా)ను విద్యార్థులు చాలా మంది సద్వినియోగం చేసుకున్నారు. కొన్ని చోట్లు ఐదు నిమిషాల కంటే కూడా ఆలస్యంగా రావడంతో పరీక్షా హాలులోకి విద్యార్థులను అనుమతించలేదు.

ఇంటర్ బోర్డు నియమించిన అబ్జర్వర్స్ పలు జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వ హించారు. మొత్తంగా తొలి రోజు ఇంటర్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య తెలిపారు. సికింద్రాబాద్, మారేడ్‌పల్లిలోని ఐదు పరీక్షా కేంద్రాలను ఆయన అకస్మికంగా సందర్శిం చారు. పరీక్షా జరిగే తీరు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఇదిలా ఉంటే నేడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరగనుంది. 5,07,949 మంది రాయనున్నారు.