సర్ ప్రక్షాళనతో గుబులెవరికి ?
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యే క సమగ్ర సవరణ ప్రక్రియ కీలక దశకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఓటరు జాబితా సవరణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మా రింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, సుమారు 2.69 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్లు తాజా గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఇంకా దాదాపు 74 లక్షల మంది ఓటర్ల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. లక్షలాది ఎన్యూమరేషన్ ఫారాలు పెండింగ్‌లో ఉండటంతో కొత్త ఓటర్ల జాబితాపై ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అత్యధిక ఎన్యూమరేషన్ ఫారాలు ఈ పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో 58.41 శాతం, మేడ్చల్‌లో 63.79 శాతం, రంగారెడ్డి జిల్లాలో 64.82 శాతం ఎన్యూమరేషన్ పూర్తయినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ జిల్లాలో 47,36, 669 మంది ఓటర్లకు గాను సుమారు 58 శాతం మంది మాత్రమే ఎన్యూమరేషన్ పూర్తిచేయడం గమనార్హం. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా ఓట్లు తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది గ్రేటర్ పరిధిలోని ఓటర్లపై ఆశలు పెట్టుకున్న పలు రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి నిమిత్తం వలస వస్తుంటారు. వీరిలో తెలంగాణతో పాటు ఏపీ సహా ఇతర రాష్ట్రాల వారు కూడా ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా చాలామంది పదే పదే చిరునామాలు మారుస్తుంటారు. అందువల్ల హైదరాబాద్‌లో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన వారు భారీ సంఖ్యలో ఉంటారు. ఇవన్ని సర్ ప్రక్రియలో ఓట్ల గల్లంతుపై ప్రభావం చూపినట్టుగా తెలుస్తున్నది.
అయితే, సర్ ప్రక్రియలో గల్లంత య్యే ఓట్లలో మెజారిటీ ముస్లిం ఓటర్లు ఉండొచ్చని మొదట అంచనాలు వెలువడ్డాయి. కానీ, తొలగియే ప్రమాదం ఉన్న ఓట్లలో ముస్లిం మైనార్టీలకు చెందినవే కాదు, వలసల కారణంగా ఇతర వర్గాల ఓట్లు కూడా ఉన్నాయని చెప్పక తప్పదు. తెలంగాణ ప్రభుత్వం 2024 సమగ్ర కుల సర్వేలో రాష్ట్రంలో 56 శాతం బీసీలు ఉన్న ట్టు తేలింది. ఓట్లు గల్లంతు అయితే సంక్షే మ పథకాలు నిలిపివేస్తారనే భ యంతో బీసీలు ఎన్యూమరేషన్ పూర్తి చేసి జాగ్రత్తగా ఇచ్చినట్టు తెలుస్తున్నది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గనున్నది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల తర్వాత సర్ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ లిస్టులో దేశంలోనే అత్యధికంగా ఓటర్ల సంఖ్య తగ్గినా మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నది. 2002 జాబితాలో ఉన్న ఓటర్లలో సగటున 50 శాతం కూడా స్థానికంగా ఉండటం లేదని బీఎల్‌వోల సర్వేలో తేలింది. రెండు నెలల క్రితం వరకు రాష్ట్రంలో 3.38 కోట్ల ఓటర్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 2.64 కోట్లకు తగ్గుతుందని అంచనాకు వచ్చారు.
ఇతర రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఓటరు సవరణ ప్రక్రియలో భారీగా ఓట్లు తొలగిపోవడం, అర్హు లైన వారి పేర్లు సైతం జాబితా నుంచి గల్లంతు కావడం వంటి పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న ఓటుబ్యాంకుకు గండిపడుతుందేమోనన్న ఆందోళన తో అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాయి. గత అనుభవాల దృష్ట్యా ఓటు నమోదు ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా, అది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాయకులు భావిస్తున్నారు. రా ష్ట్రంలో మొత్తం ఓటర్లలో 73.95 లక్షల మంది వారి ఎన్యూమరేషన్ ఫారాలు తిరి గి ఇవ్వలేదు. అంటే దాదాపు 22 శాతం తిరిగి ఓటర్ల జాబితాలో నమోదు కాలేదు.
గ్రేటర్ హైదరాబాద్‌లో 58.58 శాతం డిజిటైజేషన్ పూర్తయ్యిందని గణాంకాలు చెబు తున్నాయి. అందుకే గ్రేటర్ హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాలో 50 శాతం పోలింగ్ నమోదు కాని సందర్భాలు లేకపోలేదు. అదే సమయంలో గ్రామీణ ప్రాం తాల్లో పోలింగ్ ఎక్కువగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో తమకు అను కూలంగా ఓటర్ల జాబితాలో మార్పులు జరుగుతాయని భావించడం కంటే, పారదర్శకతతో కూడిన శుద్ధి ప్రక్రియ జరగడం ప్రజాస్వామ్యానికి ముఖ్యమని గుర్తించాల్సిన సమయం వచ్చింది.
రాజకీయ పార్టీలు సాధారణంగా ఓట రు జాబితా సవరణలను తమ రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడటం సహజమే. ఏ నియోజకవర్గంలో ఎన్ని పేర్లు చేరాయి? ఎన్ని తొలగించబడ్డాయి? ఏ ప్రాంతాల్లో మార్పులు జరిగాయి? అనే అంశాలపై పార్టీలు లెక్కలు వేసుకుంటా యి. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట రు జాబితా అనేది ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా, లేదా ప్రతికూలంగా ఉండాల్సిన పత్రం కాదు. అది ప్రజల రాజకీయ హక్కులకు ప్రాతినిధ్యం వహించే అధికారిక ఆధారం.
రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు, 76 రెవెన్యూ డివిజన్లు, 620 మండలాలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 పురపాలికలు, 10,434 రెవెన్యూ గ్రామాలు, 12,769 గ్రామ పంచాయతీల వివరాలను విభాగాల వారీగా అధికారులు గుర్తించి పెట్టుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 83.04 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి అసలైన బలం ఓటర్ల సంఖ్యలో కాదు; ప్రతి అర్హుడి ఓటు హక్కు రక్షించడంలో ఉంది. ఓటరు జాబితా ఎంత శుద్ధి గా, పారదర్శకంగా ఉంటే ఎన్నికలపై ప్ర జల విశ్వాసం అంత బలపడుతుంది.
రాజకీయ పార్టీల ఆశలు గల్లంతవుతున్నాయా, లేదా అన్నది అసలు ప్రశ్న కాదు. అర్హుడైన ప్రతి ఓటరుకి తన ఓటుహక్కు భద్రంగా ఉందా? అన్నదే ప్రధానమైన ప్రశ్న. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 71.34 శాతం పోలింగ్ నమో దు కాగా, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో రంగారెడ్డి మినహా ఎక్కడ 50 శాతం మించలేదు. యాకుత్‌పుర నియోజకవర్గంలో 39.64 శాతం నమోదు కావడం చూస్తే ‘సర్’ ప్రక్రియను తప్పుబట్టాల్సిన అవసరం లేదనిపిస్తున్నది.
సమగ్ర ఓటరు జాబితా సవరణ పేరు తో జరిగే ప్రక్రియపై రాజకీయ పార్టీలకు ఉన్న అంచనాలు, ఆశలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈ జాబితాలో పేరు లేకపోతే అర్హులైన ఓ టర్లు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చు. 2002లో తెలుగు నమోదైన ‘వి’ కి బదులు ఇంగ్లిష్‌లో (వి.ఈ.ఈ), ‘యస్’ కు బదులు వైఈఎస్ ఉందని చిన్న, చిన్న కారణాలతో తిరస్కరించిన ఓటర్లు కొత్తగా నమోదు చేసుకోవడానికి ఫారం సమర్పించి సరిదిద్దుకోవాలి.
బీహార్‌లో ఫారం ద్వారా 21.53 లక్షల మంది అర్హులైన ఓటర్లను చేర్చారు. ప్రస్తుతం 73.5 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెప్ప డం కంటే, 74 లక్షల మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఇంకా పూర్తికాలేదని చెప్పడం సరైనది. తెలంగాణలో రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ వ్యూహాలను ఓటర్ల జాబితా మార్పులపై కాకుండా ప్రజల సమస్యలపై కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నదని చె ప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.
గల్లంతయ్యే ఓట్లలో ముస్లిం మైనారిటీలు, హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ‘సర్’ పుణ్యమాని తీర్పును ప్రభావితం చేసే జాబితాలో బీసీలు చేరడం మే లు జరుగుతుందనే భావన ఉన్నది. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా తమకు అనుకూలంగా మారుతుందనే ఆశలు పెట్టుకో వడం కన్నా, సింహభాగంగా ఉన్న ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే విధానాలపై దృష్టి పెట్ట డం పార్టీలకు మేలు చేస్తుంది. ఓబీసీలు చేస్తున్న ‘మేమెంతో మాకంతా’ పోరాటానికి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అండగా నిలవాల్సిన తరుణమిది.
వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి, -9866255355
ప్రొ.సంగని మల్లేశ్వర్






