టైటిల్ చిక్కేదెవరికో ?
ఐపీఎల్ 19వ సీజన్ క్లైమాక్స్‌కు చేరింది. మరికొద్ది గంటల్లో ఈ సీజన్ ఛాంపియన్ ఎవరో తేలిపోనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ టైటిల్ పోరులో తలపడబోతున్నాయి. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మెగా ఫైనల్ జరగబోతోంది. బలాబలాల పరంగా, ఫామ్ పరంగా చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో తుది పోరు హోరాహోరీగా సాగడం ఖాయమని చెప్పొచ్చు.
- నేడు ఐపీఎల్ ఫైనల్
- ఆర్‌సీబీ, గుజరాత్ తుది సమరం
- ఎవరు గెలిచినా రెండో టైటిల్ సొంతం
అహ్మదాబాద్, మే 30 : 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గత సీజన్‌లో ఛాంపియ న్‌గా నిలిచిన ఆర్‌సీబీ ఇప్పుడు రెండో టైటిల్‌పై కన్నేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టి ఫైనల్ కు దూసుకొచ్చింది. లీగ్ స్టేజ్ లో 9 విజయాలు సాధించి అగ్రస్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరింది. క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌నే ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. గత సీజన్ కంటే మరింత బలం గా కనిపిస్తోన్న ఆర్‌సీబీ మరోసారి టైటిల్ గెలుస్తుందని ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
ఓపెనర్లుగా వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. ఫిల్ సాల్ట్ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేకపోవడంతో ఫైనల్లో ఆడడం అనుమానంగానే ఉంది. ఈ సీజన్‌లో కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 15 మ్యాచ్‌లలో 600 పరుగులు చేసిన విరాట్ తుది పోరులో చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే పటిదార్ , పడిక్కల్ , టిమ్ డేవిడ్ , జితేశ్ శర్మ హిట్టింగ్ చేస్తే ఇక ఆర్సీబీ భారీస్కోరు చేయడం ఖాయం. బెంగళూరు విజయాల్లో కనీసం ఇద్దరు ముగ్గురు బ్యాటర్లు ప్రదర్శనే కీలకంగా మా రింది.
అటు బౌలింగ్‌లోనూ బెంగళూరు దుమ్మురేపుతోంది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేస్ పదును ఏమాత్రం తగ్గ లేదు. సీజన్ ఆరంభం నుంచీ తనదైన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. 15 మ్యాచ్ లలో 26 వికెట్లు పడగొట్టాడు. ఆర్‌సీబీ విజయాల్లో భువీదే కీ రోల్. అలాగే మరో ము గ్గురు పేసర్లు కూడా రాణిస్తున్నారు. హ్యాజిల్ వుడ్, జాకబ్ డఫీ, రసిక్ సలామ్ దార్ పేస్ ఎటాక్‌లో సత్తా చాటుతున్నారు. ఇక స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా అదరగొడుతున్నాడు.
అతనితో పాటు సుయాశ్ శర్మ కూ డా రాణిస్తున్నాడు. కాగా బెంగళూరు ఐపీఎల్ ఫైనల్ చేరడం ఇది ఐదోసారి. మరో వైపు గుజరాత్ టైటాన్స్ కూడా అద్భుతంగా రాణిస్తూ ఫైనల్‌కు దూసుకొచ్చింది. నిజానికి మిగిలిన జట్లతో పోలిస్తే గుజరాత్ ఫైనల్ చేరుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అయితే బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ నిలకడైన ప్రదర్శనతో ఇప్పుడు టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. గుజరాత్ బ్యాటింగ్ బలం టాపార్డర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభమన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు.
వీరిద్దరూ ఇచ్చే ఆరంభాలతో గుజరాత్ భారీస్కోర్లు సాధిస్తోంది. ఎలాంటి టార్గెట్‌నైనా ఛేదిస్తోంది. లీగ్ స్టేజ్‌ను రెండో స్థానంలో ముగిం చిన గుజరాత్ క్వాలిఫైయర్ 1లో మాత్రం విఫలమైంది. ఆ మ్యాచ్‌లో టాపార్డర్ వైఫ ల్యం ఓటమికి కారణమైంది. అయితే క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్‌పై అదే టాపార్డర్ అదరగొట్టి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో బెంగళూరుపై ప్రతీకారం కోసం గుజరాత్ ఎదురుచూస్తోంది. పైగా ఈ మ్యా చ్ వారి హోం గ్రౌండ్ అహ్మదాబాద్‌లో జరగనుండడం మరో అడ్వాంటేజ్.
బ్యాటింగ్‌లో గిల్, సాయి సుదర్శన్, బట్లర్ రాణిస్తే టైటా న్స్ కు తిరుగులేనట్టే. అయితే వీరు విఫలమై తే తర్వాత జట్టును ఆదుకునే బ్యాటర్ లేకపోవడం గుజరాత్‌కు మైనస్ గా మారింది. అటు బౌలింగ్‌లో మాత్రం గుజరాత్ మంచి ఫామ్ లో ఉంది. రబాడ, సిరాజ్, హోల్డర్ , ప్రసిద్ధ కృష్ణ పేస్ ఎటాక్ లో ఉన్నారు. రబా డ 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అలాగే జాసన్ హోల్డర్ కూడా కీలక సమయంలో వికెట్లు తీస్తున్నాడు. మొత్తం మీద ఇరు జట్లు దాదాపు సమానంగానే ఉ న్నా హోంఅడ్వాంటేజ్ తో గుజరాత్ కాస్త పై చేయిగా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.
బౌలర్లు చేతుల్లోనే ఫైనల్లో విజయం ఆధారపడి ఉంది. అహ్మదాబాద్ పిచ్‌పై 200కు పైగా పరుగులు చేయడం తేలి క. కానీ ఆ స్కోరును కాపాడుకోవడం చాలా కష్టం. భువనేశ్వర్ కుమార్ అ ద్భుతమైన బౌలర్. మిగిలిన బౌలర్ల నుంచి అతనికి మద్ధతు దొరకాలి.
పటిదార్, బెంగళూరు కెప్టెన్
మా హోంగ్రౌండ్‌లో ఆడనుండడం అడ్వాంటేజే. కానీ ఐపీఎల్ లాంటి టో ర్నీ ఫైనల్స్‌లో మానసిక బలమే ప్రధా నం. ఫైనల్లో ఉండే ఒత్తిడిని అధిగమించిన జట్టే పై చేయి సాధిస్తుంది. ఏ టీమ్ తరపున ఆడినా అంచనాలు తప్పకుం డా ఉంటాయి. భారత టీ20 జట్టులోకి నన్ను తీసుకుంటే సంతోషమే.
శుభమన్ గిల్, గుజరాత్ కెప్టెన్
గత రికార్డులు
ఇరు జట్లు 9 సార్లు తలపడగా ఐదింటిలో బెంగళూరు, నాలుగు సార్లు గుజరాత్ విజయం సాధించింది. ఈ సీజన్‌లో మూడుసార్లు తలపడగా రెండుసార్లు బెంగళూరు గెలిచింది.
పిచ్ రిపోర్ట్
అహ్మాదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడ యావరేజ్ స్కోర్ 186గా నమోదవుతుండగా ఫైనల్లో 200 ప్లస్ స్కోర్లు వచ్చే ఛాన్సుంది.
తుది జట్ల అంచనా
బెంగళూరు : వెంకటేశ్ అయ్యర్, కోహ్లీ, పడిక్కల్, పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, డఫీ, హ్యాజిల్‌వుడ్, రసిక్ సలామ్ దార్
గుజరాత్ : సాయి సుదర్శన్, గిల్ (కెప్టెన్), బట్లర్, నిశాంత్ సంధు, వాషింగ్టన్ సుందర్, హోల్డర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, రబాడ, ప్రసిద్ధ కృష్ణ, సిరాజ్






