31 May, 2026 | 2:07 AM

ఇంగ్లాండ్‌దే రెండో టీ20

31-05-2026 01:16 AM
  1. భారత మహిళల ఓటమి
  2. 1 సిరీస్ సమం

బ్రిస్టల్, మే 30 : భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టు పుంజుకుంది. తొలి టీ20 ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. బ్రిస్టల్ వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో 26 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగు లు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఫ్రెయా కెంప్ 13 బంతుల్లో39( 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

డానీ వైట్ హాడ్జ్ 29, ఎమీ జోన్స్ 28, ఆలిస్ క్యాప్సే 28 పరుగులతో రాణించారు. సోఫియా డంక్లీ (10), హేథర్ నైట్ (18) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. డేనియల్ గిబ్సన్ 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. టీమ్‌ఇండియా బౌలర్లలో శ్రీ చరణి 3, నందిని శర్మ, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసింది.

యస్తిక బాటియా (33 రిటైర్డ్ ఔట్; 36 బంతుల్లో 5 ఫోర్లు), స్మృతి మంధాన 25 బంతుల్లో 32 (5 ఫో ర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (28), షెఫాలీ వర్మ (22), పరుగులు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (1), రిచా ఘోష్ (8), దీప్తి శర్మ (2), శ్రేయాం క పాటిల్ (6), శ్రీచరణి (1) బ్యాటింగ్లో విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్, లారెన్ బెల్,  షార్లెట్ డీన్ తలో 2 వికె ట్లు, సోఫీ ఎక్లెస్టోన్ 1 వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 1 సమం చేసింది.