19-12-2025 01:57:26 AM
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐడీపీఎల్ భూముల కబ్జా భాగోతాలపై విచారణ జరగకుండా చేసింది కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాదిరెడ్డి యుగందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తన బండారం ఎక్కడా బయటపడుతుందోనని ముందుగానే విచారణ జరిపించాలని లేఖ రాసినట్లు చెబుతున్నారని గురువారం ఆయన ఒక ప్రకటన లో పేర్కొన్నారు.
ఐడీపీఎల్ భూములు అక్రమాలపై విచారణ జరిపించాలని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే డిమాండ్ చేస్తోందని, సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు యుగంధరెడ్డి చెప్పారు. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు భూ భాగోతం బయపడుతుందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న ప్పుడు ఎమ్మెల్సీ కవిత ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు.