calender_icon.png 12 September, 2024 | 11:35 PM

వినేష్ ఫోగట్‌కు సిల్వరైనా ఎందుకు దక్కదు.. ?

08-08-2024 01:41:53 PM

కుదిరితే స్వర్ణం... లేదంటే రజితంతో తిరిగొస్తుందనుకున్న వినేష్ ఇప్పుడు అనర్హురాలిగా తేలి పతకానికి దూరమవటం భారత క్రీడాభిమానులను నిరాశకు గురి చేస్తున్నది. అసలు ఆమెపై అనర్హత ఎలా వేస్తారని వారిలో కుతూహలం రేకెత్తించిన వైనాన్ని దేశ వ్యాప్తంగా చేస్తున్నాం. ఇద్దరు అథ్లెట్లు శారీరకంగా పరస్పరం తలపడే బాక్సింగ్ , రెజ్లింగ్, జూడో , కరాటే, బాక్సింగ్ మిక్స్డ్ మార్షల్  ఆ ర్ట్స్   తదితర క్రీడా విభాగాలలో కచ్చితంగా వేర్వేరు బరువు విభాగాలుంటాయి.

ఉదాహరణకు 53 కేజీల విభాగం  లో ఉన్న వాళ్లు 50 కేజీల విభాగంలోని వాళ్లతో తలపడేందుకు అవకాశం లేదు. ఎక్కువ బరువు ఉంటే ప్రత్యర్థి పై పైచేయి సాధించే ఆస్కారం  ఉంటుందనే కారణంతో అందరూ ఒకే బరువు ఉండాలనే నిబంధన ఉంది. అందుకే పోటీలకు ముందు అందరి బరువు సరిగ్గానే ఉందో లేదో తనిఖీ చేస్తారని క్రీడా నిపుణులు చెబుతున్నారు. నిర్దేశిత బరువుకంటే తక్కువ ఉన్నా అనుమతిస్తారు కానీ ఎక్కువ ఉంటే అనర్హత వేటు పడుతుంది. బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి వినేశ్ తీవ్రంగా శ్రమించింది. నీరు తాగకుండా కార్బో హైడ్రేట్ రహిత ఆహారంతో తీవ్ర కసరత్తులు చేసి 49.90 కేజీలకు చేరింది. కానీ శక్తి కోసం తీసుకున్న స్వల్ప ఆహారం డీహైడ్రేషన్ కాకూడదని తాగిన కాస్త నీరు కారణంతో బరువు పెరిగి 52.7 కిలోలకు చేరుకుంది. ఈ కారణంగా వినేశ్ పై అనర్హత వేటు పడిందని క్రీడా నిపుణులు పేర్కొన్నారు.