calender_icon.png 13 September, 2024 | 12:07 AM

కర్ణాటక ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ

08-08-2024 02:58:31 PM

హైదరాబాద్: కర్నాటక పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో గురువారం భేటీ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వంతో వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు బెంగళూరు చేరుకున్న పవన్ కళ్యాణ్ కి కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు సాదరస్వాగతం పలికారు. ఆ రాష్ట్ర బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ సుధీంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.