calender_icon.png 9 May, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

08-08-2024 01:01:58 PM

కేరళ: ప్రకృతి విలయంలో వయనాడ్ విలవిల్లాడింది. ప్రకృతి ప్రకోపానికి వందల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన కొండచరియల విపత్తు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కేరళలోని వయనాడ్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొండచరియలు విరిగిపడిన చూరల్‌మల, ముండక్కై గ్రామాల పరిస్థితిని ప్రధాని సమీక్షించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించిన తర్వాత, సహాయక శిబిరాన్ని సందర్శించనున్నట్లు సమాచారం. వాయనాడ్ కొండచరియలను "జాతీయ విపత్తు"గా ప్రకటించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన పలువురు ఎంపీలు కేంద్రాన్ని కోరిన తర్వాత ప్రధాని పర్యటన జరిగింది.