12 July, 2026 | 10:56 AM

ఇలా అయితే కష్టం

05-05-2024 12:15 AM

న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్‌లో హిట్టింగ్ కోసం మైదానాల పరిమాణాన్ని తగ్గించేస్తున్నారని టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇదే ట్రెండ్ కొనాసగితే ఆట వన్ సైడ్ గేమ్‌గా మారిపోయే ప్రమాదముందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదవుతున్న తరుణంలో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకన్నాయి. ‘గతంలో నిర్మించిన స్టేడియాలతో పోలిస్తే ఇప్పటి వాటిలో చాలా తేడా కనిపిస్తోంది. స్పాన్సర్స్ అందజేసిన ఎల్‌ఈడీ బోర్డులను ఉపయోగించడం ద్వారా బౌండరీ దూరం 10 గజాలకు తగ్గింది. ఇది బ్యాటర్లకు ఉపయుక్తంగా మారింది. కేవలం హిట్టింగ్‌ను దృష్టిలో పెట్టుకొని స్టేడియాల సైజ్‌ను తగ్గించేస్తున్నారు. ఇది బాధాకరం. బౌలర్లు వికెట్లు తీయాలంటే ఎక్కువ శ్రమిచాల్సి వస్తోంది. ఈ విషయంలో బౌలర్లకు మెంటల్ బూస్ట్ అవసరం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే గేమ్ వన్‌సైడ్‌గా మారిపోతుంది’ అని అశ్విన్ అన్నాడు.