31-08-2025 12:18:32 AM
అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం సంతోషం: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి ): అసెంబ్లీ సమావేశాలను తాము పూర్తి ప్రజాస్వామికంగా నడుపుతున్నామని, సభ లో చర్చకు అందరికి పూర్తిస్థాయిలో అవకాశం ఇస్తామని రాష్ట్ర శాసనసభా వ్యవహా రాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శనివారం ఆన అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ తప్పులు చేసిన వారి కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు అని బీఆర్‌ఎస్ నేతలను నిలదీశారు.
తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా ణంలో తప్పులు చేసిన వాళ్లు.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమెంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఏమైనా ఒప్పులు చేస్తే అవకాశం ఉండేదని, సభలో ఎవరికైనా ఆర్డర్ ప్రకారం మాట్లాడటానికి అవకాశం ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చిస్తామన్నా రు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపైనా చర్చిస్తామన్నారు.
వరదల సమస్య తీవ్రంగా ఉన్నం దున, అన్ని అంశాలపై చర్చ చేయాలంటే నాలుగైదు రోజులు సభకు బ్రేక్ ఇచ్చి మళ్లీ నడుపుతామన్నారు. గణేశ్ నిమజ్జనం, వరదల నేపథ్యంలో మధ్యలో బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం మం చి నిర్ణయమ ని, అంతర్జాతీయ క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతులున్న అజారుద్దీన్ పేరును ఎ మ్మెల్సీ పద వికి ప్రతిపాదించడం సంతోషకరమన్నారు.