calender_icon.png 16 December, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చొరబాటుదారులపై ప్రేమెందుకు?

16-12-2025 01:18:34 AM

  1. వాళ్ల ఓట్లు తీసేస్తే మీకేంది బాధ? 
  2. భారతీయుల పేర్లే ఓటర్‌లిస్టులో ఉండాలి
  3. పటేల్‌ను కాంగ్రెస్ మర్చిపోయింది 
  4. రాజ్యాంగాన్ని అవహేళన చేసిన వారినే గుర్తుంచుకున్నారు 
  5. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 15  (విజయక్రాంతి): పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల మీద ఇంత ప్రేమ ఎందు కు?, చొరబాటుదారుల మీద ఇంత అనురాగం ఎందుకు? వాళ్ల ఓట్లు తీసేస్తే మీకు ఇబ్బంది ఏం టని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఎక్క డా భారతీయులు కాని వారికి ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండాలనే అవకాశం లేదని, భారతీ య జనతా పార్టీ ఈ విషయానికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

భారతీయుల పేర్లే ఓటర్ లిస్ట్‌లో ఉండాలని, అర్హులైన వారి పేర్లు ఎప్ప టికీ తొలగించబడవని తెలిపా రు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కాంగ్రెస్ పూర్తిగా మరిచిపోయిందని, ఎవరైతే రాజ్యాంగాన్ని అవ హేళన చేశారో, రాజ్యాంగాన్ని కాలరాశారో వారినే ఆ పార్టీ, నేతలు గుర్తు చేసుకుంటున్నారని విమర్శించారు.  నెహ్రూని ఎదిరించి, రాజ్యాంగాన్ని కాపాడాలనే దృఢమైన వైఖరితో నిలబడిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, అయితే ఆయనను జవహర్‌లాల్ నెహ్రూ ఎదుర్కొన్నారన్నారు.

రాజకీయంగా ముందుకు వెళ్లాలంటే ‘అవసరమైతే రా జ్యాంగాన్ని కూడా పక్కన పెట్టొచ్చు’ అనే వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎన్ రాంచం దర్ రావు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం మాట్లాడారు. నెహ్రూ తరువాత కాలంలో ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీని ప్రకటించారని, నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దాదాపు 560కి పైగా చిన్న చిన్న రాజ్యాలను ఏకీకృతం చేసి, ఒక మహత్తరమైన భారతదేశాన్ని నిర్మించిన మహానుభా వుడని కొనియాడారు.  

ఎన్నికల కమిషన్‌ను బెదిరిస్తున్నారు..

రాజ్యాంగాన్ని కాలరాసిన వ్యక్తి ఇందిరా గాంధీ అని, ఆ రోజుల్లో ఎలక్షన్ కమిషన్‌ను కూడా వాళ్లే నియమించుకున్నారని తెలిపారు. ఆ సమయంలో ఎలక్షన్ కమిషన్ నియామకాలపై పార్లమెంట్‌లో ఎల్‌కె అడ్వా ణీ ప్రశ్నించారని, ఈ రోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు ‘ఓట్ చోరీ’ అంటూ మాట్లాడారని, ప్రియాంకా గాంధీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను బెదిరించే స్థాయి కి వెళ్లారని, వాళ్ల పేర్లు తీసుకుని మరీ బెదిరించారని పేర్కొన్నారు.

ఇంకొక వైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ లో మాట్లాడుతూ మీ అధికారం పోతుంది, మీ ఓట్లు పోతాయి, ఓట్లు పోతే ఆధార్ కార్డు పోతుందంటూ బెదిరించారని, ఓట్లు పోయేది ఎవరివి? భారతీయులవి మాత్రం కాదని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక, ఎన్నికల్లో ఓడిపోయి, ఈ రోజు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతాల పేరు మీద రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.  ఇలాంటి రాజకీయాలు బంద్ చేయాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నామన్నారు.  కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బొందపెట్టే రోజు దగ్గరలోనే ఉందని, మిగిలిన రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఆ పార్టీని పాతరేసేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

మూడో దశలో మరిన్ని స్థానాలు గెలుస్తాం..

తెలంగాణ రాష్ర్టంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అన్ని గెలిచాం.. ఇన్ని గెలిచామని లెక్కలేస్తున్నారని, కొన్ని చోట్ల బెదిరింపులతో గెలిచి ఉండొచ్చు.. కానీ భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించారన్నారు. గతంలో బీజేపీకి 163 సీట్లు మాత్రమే వచ్చాయని, ఈరోజు ఇప్పటికే 600కి పైగా సర్పంచ్ స్థానాలు పార్టీ మద్దతుదారులు గెలిచారని,  ఇంకో దశ ఎన్నికలున్నాయని, దాదాపు 45 వేల మందికి పైగా వార్డ్ మెంబర్లు బీజేపీ తరఫున గెలిచారని చెప్పారు.

రానున్న మూడో విడత ఎన్నికల్లోనూ మరిన్ని స్థానాల్లో గెలుస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 300కి పైగా సీట్లు పెరుగుతాయని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీపై నమ్మకం పెట్టి ఓటు వేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.  కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డా. గౌతం రావు, పార్టీ సీనియర్ నాయకులు చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, పార్టీ రాష్ర్ట ముఖ్య అధికార ప్రతినిధి మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్ పాల్గొన్నారు.

ప్రజల హక్కులపై మా కార్పొరేటర్లు పోరాడుతారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర ప్రజల హక్కుల కోసం, పారదర్శకతతో కూడిన పాలన కోసం బీజేపీ కార్పొరేటర్లు గట్టిగా పోరాడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో జరిగిన జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల సమావేశానికి ఎన్. రామచందర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన పలు కీలక పౌర, సంస్థాగత అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

ముఖ్యంగా పట్టణ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యంపై సమీక్ష జరిపినట్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను మరింత సమర్థంగా లేవనెత్తుతూ, జీహెచ్‌ఎంసీలో బాధ్యతాయుతమైన, ప్రజాకేంద్రిత పాలన అందించేందుకు బీజేపీ కార్పొరేటర్లు అనుసరించాల్సిన కార్యాచరణపై కార్పొరేటర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు.