ఒకేరోజు 18 వికెట్లు
- ఆసీస్, బంగ్లా టెస్టులో బౌలర్ల హవా
- బంగ్లాదేశ్ 64 ఆలౌట్, ఆసీస్ 165/8
మెక్ కే, ఆగస్టు 22: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమైన రెండో టెస్టులో బౌలర్ల హవా మామూలుగా లేదు. తొలి రోజు ఏకంగా 18 వికెట్లు నేలకూలాయి. తొలి టెస్టులో గెలిచిన ఉత్సాహంలో ఉన్న బంగ్లాకు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు బంగ్లాదేశ్ కేవ లం 64 రన్స్‌కే కుప్పకూలింది. షోరిఫుల్ ఇ స్లామ్ 14 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలానే నలుగురు బంగ్లా బ్యాటర్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు.
మరో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్టార్క్ 10 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్ తో డు కమిన్స్ సైతం విజృంభించి మూడు వికెట్లు పడగొట్టాడు. హేజిల్‌వుడ్ ఒక వికెట్ సాధించాడు. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ బౌలర్ షోరిఫుల్ ఇస్లాం వణికించాడు. 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడంతో ఆసీస్ 165 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెమరూన్ హాఫ్ సెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ 101 పరుగుల ఆధిక్యంలో ఉంది.






