12 July, 2026 | 5:04 PM

లవర్ కోసం.. భర్తని హత్య చేయించిన భార్య

15-06-2024 10:15 AM

ఆదిలాబాద్ జిల్లాలో ఓ వివాహిత లవర్ కోసం భర్త హత్య చేయించింది. జిల్లాలో రెండు రోజుల క్రితం ఉపాధ్యాయుడు జాదవ్‌ గజానంద్‌ జైనథ్‌ (40) హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మృతుడి భార్య విజయలక్ష్మి, మహేష్  అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు గుర్తించారు. భర్తను అడ్డు తొలగించుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. నిందితురాలైన విజయలక్ష్మి ఫోన్ లో పోలీసులు కొన్ని ఫోటోలను గుర్తించామన్నారు. అయితే ప్రియుడి కోసమే భార్య విజయలక్ష్మి సుపారీ గ్యాంగ్‌తో పోన్లో‌ మాట్లాడి భర్తను చంపించినట్లు పోలీసులు గుర్తించారు.