calender_icon.png 24 August, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు కిందపడి ఇంటర్ విద్యార్థిని దుర్మరణం

14-06-2024 04:40:32 PM

హైదరాబాద్ : నగరంలో ఘోర విషాదం జరిగింది. ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి ఓ ఇంటర్ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. యూసఫ్ గూడాలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు.