calender_icon.png 22 August, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్తను హత్య చేయించిన భార్యకు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా

22-08-2025 12:34:11 AM

  1. హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు, పదివేల  జరిమానా
  2. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి

కామారెడ్డి, ఆగస్టు 21 (విజయ క్రాంతి), భర్తను హత్య చేయించిన భార్యకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం జిల్లా న్యాయస్థానం లో తీర్పు వెలువరించారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుని  భర్తను హత్య చేయించిన మహిళ వివరాలు ఇలా ఉన్నా యి. 21 సెప్టెంబర్2022 న కామారెడ్డి జిల్లా దేవన్పల్లి చెందిన ఫకీర్ నసీమా, భర్త  షబ్బీర్  కూలీ పని కోసం వెళ్ళి రాత్రి వరకు  రాలేదని ఫోన్ రాత్రి వరకు పనిచేసి స్విచ్ ఆఫ్ చేయబడిందని  మరుసటి రోజు నసీమ దేవునిపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది.

పోలీసులు మిస్సింగ్  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 22 సెప్టెంబర్2022 తాడ్వాయి మండలం కనకల్ గ్రామం శివార్లోని ఉసరికాయల గడ్డ వద్ద ఒక గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైందని తెలువగా నసీమ కుటుంబసభ్యులతో కలిసి వెళ్ళి ఆమె భర్త దుస్తులు  ముఖాన్ని గుర్తించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కొట్టి గాయపరిచి చంపారని ఆమె తెలిపింది.

ఆమె భర్త కడుపు, తల, ఎడమ వైపు నుదిటిపై రక్తపు గాయాలు ఉన్నాయి. హత్య చేసిన వ్యక్తులపై  చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిర్యాదు మేరకు తాడ్వాయి పోలీ సులు  కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ కేసు విచారణలోఫిర్యాదురాలుపై అనుమానం వచ్చి విచారించగ ఆమె మరొకరితో అక్రమ సంబందం పెట్టుకొనగా  తన భర్త అయిన షబ్బీర్ అడ్డు వస్తున్నాడని అతనిని ఎలాగైనా చంపాలని ఉద్దేశ్యంతో వడ్డే హన్మంతు కు తన భర్తను హత్య చేయమని చెప్పగా అతను మృతుడు షబ్బీర్ ను ద్విచక్ర వాహనముపై కనకల్ గ్రామ శివారులోకి తీసుకొని వెళ్ళి అధికంగా మద్యం తాగించి తలపై కర్రతో కొట్టి చంపి అక్కడే ఉన్నగుహలోపడేసినాడు అని తెలిపింది.   

పరిశోధన లో భాగంగా మృతుడి,బందువులు, గ్రామస్తులనువిచారించి ఇట్టి హత్యకేసులో A1 వడ్డే హన్మంతు @ రాజు A2 ఫకీర్ నసీమా  ను నేరస్తులుగా  గుర్తించి అరెస్టు చేసి నేరస్తుడిపై కోర్టు యందు అభియోగ పత్రం వేయడం జరిగింది.

కేసులోని సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని  జిల్లా న్యాయమూర్తి సిహెచ్ వి ఆర్ ఆర్  వర ప్రసాద్  నిందితుడు అగు ఒడ్డె హనుమంతు @ రాజుకు జీవిత ఖైదు, 10 వేల  జరిమానా,  మృతుని భార్యకు జీవిత ఖైదు,౫వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూయసమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని, శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని,

పోలిసులు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ,  న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని తెలిపినారు.  పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ టి.రాజగోపాల్ గౌడ్, ఈ కేసును  సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి  సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు రామన్, ఏఎస్త్స్ర  సంజీవ్,   ప్రస్తుత సదాశివ నగర్ సర్కిల్  ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, ప్రస్తుత  తాడ్వాయి యస్‌ఐ మురళి. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్త్స్ర రాజయ్య, ఏఎస్త్స్ర రామేశ్వర్ రెడ్డి,సి.డి.ఓఐ.సతీశ్ గౌడ్ లను జిల్లా ఎస్పీ  అభినందించారు.