భారత్ నిలుస్తుందా ?
వరల్డ్ ఛాంపియన్.. పొట్టి క్రికెట్ లో నెం.1... గత కొన్ని నెలలుగా తిరుగులేని రికార్డు... కానీ ఇంగ్లాండ్ గడ్డపై భారత టీ20 జట్టు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. అంతకుముందే ఐర్లాండ్ చేతిలో ఓటమితో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు ఇంగ్లీష్ గడ్డపైనా పేలవ ప్రదర్శనతో వెనుకబడిపోయింది. మరి సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన నాలుగో టీ20లో భారత్ పుంజుకుంటుందా ?
- నేడు ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20
- వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడి
- బ్యాటర్ల ఫ్లాప్ షోతో విమర్శలు
- సిరీస్ విజయంపై ఇంగ్లాండ్ కన్ను
రా. 2'౦' గంటలకు మ్యాచ్ ప్రారంభం
బ్రిస్టల్, జూలై 8 : ఇంగ్లాండ్‌లో టీమిండియా ఇంత పేలవంగా ఆడుతుందని ఎవ్వ రూ ఊహించలేదు. రెండో టీ20లో కొంచెం మెరుగ్గానే ఆడినా మూడో మ్యాచ్‌లో మా త్రం దారుణ ఓటమిని మూ టగట్టుకుంది. కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ శర్మ నుంచి శివమ్ దూబే వరకూ ఏ ఒక్క బ్యాట ర్ క్రీజులో నిలవలేకపోయా రు. అంచనాలు పెట్టుకున్న వైభ వ్ సూర్యవంశీతో సహా కీలక బ్యాటర్లంతా చేతులెత్తేశారు. బ్యాటర్లు గాడిన పడితే తప్ప భారత్ ఈ సిరీస్‌లో పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు.
బ్రిస్టల్ వేదికగా జరగబోయే నాలుగో టీ ట్వంటీ కోసం భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. వరుసగా విఫలమవుతున్న తిలక్ వర్మను కొనసాగిస్తారా లేక చివరి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఒకవేళ తిలక్‌ను తప్పిస్తే అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుని, వన్‌డౌన్‌లో ఆడించే ఛాన్స్ ఉంది. సంజూను వరుసగా రెండు మ్యాచ్‌లకు తప్పించడంపై అటు మా జీలు, ఇటు అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అ రంగేట్రం చేసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై భారీ ఆశలే పె ట్టుకున్నారు. కానీ, అతడు అంచనాలు అందుకోలేకపోతున్నాడు. అభిషేక్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కి షన్, శివమ్ దూబే మెరుపులు మెరిపించాల్సి ఉంది. అటు బౌలింగ్‌లో నూ భారత్ మెరుగుపడాల్సిన అవసరం కనిపిస్తోంది. స్పిన్నర్లు వికెట్లు తీయలేకపోతున్నారు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్లో పూర్తిగా విఫలమయ్యా డు. అతడు ఇప్పటి వరకు 7 ఓవర్లు వేసి ఒక్క వికెట్ పడగొట్టాడు.
మరోవైపు, మూడో టీ20లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 4 ఓవర్లలో ఒక వికెట్ తీసుకుని 49 రన్స్ సమర్పిం చుకున్నాడు. మూడో టీ20 పరాజయం అనంతరం సంజూను ఆడించాలంటూ ఫ్యాన్స్ గట్టిగా నినాదాలు చేశారు. మరోవైపు గంభీర్ కూడా సంజూ ఎప్పుడైనా రీఎంట్రీ ఇచ్చి మళ్లీ ఫామ్ అందుకోవచ్చని మీడియా సమావేశంలో చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనే కాకుండా బౌలింగ్ విభాగంలో కూడా మా ర్పులు చేయవచ్చు. ప్రసిధ్ కృష్ణను జట్టులోకి తీసుకుంటే అర్షదీప్‌కు రెస్ట్ ఇవ్వవచ్చు.
మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఆల్‌రౌండర్ సూర్యా న్ష్ షెడ్జేను ఆడించాలనుకుంటేఒక బౌలర్ను పక్కనపెట్టాల్సి ఉంటుంది. వీరితో పాటు ప్రధాన పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా డెత్ ఓవర్లలో దారళంగా పరుగులు స మర్పించుకున్నారు. మరోవైపు వరుసగా రెండు విజయాలతో 2- ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ సిరీస్ విజయంపై కన్నేసింది. బ్యాటింగ్‌లో సాల్ట్, బట్లర్ ఫామ్‌లో ఉండగా సామ్ కురన్ కూడా రాణిస్తున్నాడు.
బౌలింగ్‌లో ఆర్చర్, టంగ్ అదరగొడుతున్నారు. వీరి పేస్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాట ర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇక బ్రిస్టల్ గ్రౌం డ్‌లోనూ భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో ఇండియా ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడింది. 2018లో 199 రన్స్ భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి, ఇంకా 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
తుది జట్ల అంచనా
భారత్ : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్ : సాల్ట్ , బట్లర్, బ్రూక్ (కెప్టెన్), బెథెల్ , టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, డాసన్, ఆర్చర్, అదిల్ రషీద్, జోస్ టంగ్






