9 July, 2026 | 1:01 AM

ప్లే ఆఫ్స్‌లో రంగారెడ్డి రైజర్స్

09-07-2026 12:00 AM
  1. ఆరోన్ జార్స్ విధ్వంసం
  2. తెలంగాణ టీ20 లీగ్

హైదరాబాద్, జూలై 8 :యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అ సోసియేషన్ నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 లీగ్‌లో యువ ఆటగాళ్లు అదరగొడుతున్నా రు. అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో తమ తమ జట్లకు విజయాలనందిస్తున్నారు, తాజాగా రంగారెడ్డి రైజర్స్‌కు ఆడుతున్న అండర్ 19 ప్లేయర్ ఆరోన్ జార్జ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 43 బంతు ల్లోనే 91 పరుగులు చేశాడు. అతనితో పాటు ఆదిత్య తవ్వాజీ కూడా ధాటిగా ఆడడంతో రంగారెడ్డి రైజర్స్ 252 పరుగుల భారీస్కోరు సాధించింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే కనీసం 130 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండగా రంగారెడ్డి బౌలర్లు కూడా అదరగొట్టారు.

వరంగల్ వారియర్స్‌ను కేవలం 91 పరుగులకే ఆలౌట్ చేశారు. తద్వారా 161 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్ళింది. బౌలింగ్‌లో నితిన్ సాయి 3 , హితేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టారు. రంగారెడ్డి విజయంతో నల్గొండ నైట్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.   ఎలిమినేటర్ మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్, కరీంనగర్ డైమండ్స్‌తో తలపడనుండగా...క్వాలిఫైయర్‌లో హైదరాబాద్,  ఖమ్మం ఏసెస్ జట్లు ఢీకొంటాయి.