calender_icon.png 7 October, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తారుమారయ్యేనా?

07-10-2025 12:23:39 AM

-పోటా పోటీగా భారీగా ఖర్చులు 

- అనుకున్నదొక్కటి అయిందొక్కటి 

- మారిపోయిన రిజర్వేషన్ల ప్రక్రియ l

గోపాలపేట అక్టోబర్6: అయ్యో రామ అనుకున్నదొక్కటి అయిందొకటి అంటూ రా జకీయ నాయకులు బాదుకుంటున్నరు. వనపర్తి జిల్లాలోని రాజకీయ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పెట్టుకున్న తరుణంలో నీరుగార్చినట్టు అయింది. ఈసారి స్థానిక ఎన్నికల్లో తాము పోటీలో దిగుతామంటూ భారీగా ఖర్చులు చేశారు. తీరా ఎన్నికల ప్రక్రి య రిజర్వేషన్లు ప్రభుత్వం మార్చేసింది. దీం తో బరిలోకి దిగాలనుకున్న కొంతమంది నాయకులు ఆందోళన చేస్తున్నారు.

గత ప్ర భుత్వం మాదిరే గాని 10 ఏళ్ళు రిజర్వేషన్ ప్ర క్రియ మార్చకుండా యధావిధిగా కొనసాగుతాయని. స్థానిక ఎన్నికల్లో తమకే ఏక గ్రీవంగా ఎన్నుకుంటారనుకున్నా రాజకీయ నాయకులు గ్రామాల్లో ఏది కావాలన్నా ఎవరు మృతి చెందిన ఆర్థిక సహాయాలు పోటాపోటీగా చేసుకుంటూ వచ్చారు. వనపర్తి జిల్లాలో ఉన్న మండలాల్లో ఎవరికి వారు తాను బరిలోకి దిగుతున్నామంటూ కాలర్లు ఎగేసుకొని తిరిగేవారు. రిజర్వేషన్లు తారుమారు కావడంతో ప్రస్తుతం మండలాల్లో నాయకులు తామేమి పోటీకి వెళ్లాలని లేదని మరికొందరు గంభీరంగా తిరుగుతున్నారు. మరి ఈ ఎంపీటీసీ, జెడ్పిటిసి స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం కేటాయించిన కుర్చీలో ఏ పార్టీ నాయకునికి దక్కుతుందో చూడాలి మరి...

కేసును తిప్పి కొట్టిన సుప్రీంకోర్టు..

స్థానిక ఎన్నికల్లో ఖరారైన రిజర్వేషన్ ప్రక్రియ మార్చాలని సుప్రీమ్ కోర్టుకు వెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు ఎక్కడ తేల్చాల్సిన కేసు అక్కడే తెలుసుకోవాలని కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆగ్రహించింది ఈ సమస్యను తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని తిప్పి పంపించినట్లు తెలిసింది.