calender_icon.png 7 October, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వార్థ రాజకీయాలు చేయొద్దు

07-10-2025 12:24:46 AM

లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి 

ఎల్బీనగర్, అక్టోబర్ 6 : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డ్రైనేజీపై మురుగు రాజకీయాలు చేస్తున్నారని, వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారని లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. లింగోజిగూడ డివిజన్ లోని గ్రీన్ పార్క్ కాలనీలో మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో సోమవారం అధికారులతో కలిసి కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు.

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇటీవల కాలనీలో పర్యటించి, అన్ని పనులు నీనే చేయిస్తానని చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ పార్క్ కాలనీలో కార్పొరేటర్ పర్యటించి, మురుగు నీరు వెళ్లే విధంగా జీహెచ్‌ఎంసీ కార్మికులతో మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...15 రోజులుగా గ్రీన్ పార్క్ కాలనీలోని 30 ఫీట్ రోడ్ వద్ద ఉన్న బాక్స్ డ్రెయిన్ నిండిపోవడంతో రోడ్డు మీదకు వరద నీరు ప్రవహిస్తుందన్నారు.

ముఖ్యంగా పైన ఉన్న జిలేల్ గూడ చెరువు నుంచి అధికంగా నీరు రావడంతో గ్రీన్ పార్క్ కాలనీలో సమస్య మరింత తీవ్రంగా మారిందని తెలిపారు. ఇప్పటికే 40 ఫీట్ రోడ్ వైపు మురుగు నీటిని మళ్లించడానికి రూ, 10.50 లక్షలతో పనులు చేయించడానికి (ఫైల్ నంబర్ 25000514) అనుమతులు వచ్చినట్లు, కానీ వర్షాల కారణంగా అధికారులు పనులు ప్రారంభించలేకపోయారని వివరించారు.

కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, కొంతమంది నాయకులు కేవలం పర్యటనల పేరుతో ఫొటోషూట్లు చేస్తున్నారని విమర్శించారు. కానీ, అధికారులు మాత్రం ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు. 30 ఫీట్ ర్పో నిలిచిపోయిన నీటిని 40 ఫీట్ రోడ్ వైపు డైవర్ట్ చేసే పనులు సోమవారం ప్రారంభమయ్యాయని తెలిపారు. నేను స్వార్థం కోసం రాజకీయాలు చేయనని& ప్రజల కోసం పని చేస్తానన్నారు. కార్యక్రమంలో ఈఈ కార్తిక్, డీఈ రవిచంద్, ఏఈ విజయ్, వర్క్ ఇన్స్పెక్టర్ రాకేశ్, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.