calender_icon.png 7 October, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదరాజస్వామి ఆలయ అభివృద్ధికి విరాళం

07-10-2025 12:23:16 AM

కీసర , అక్టోబర్ 6 ( విజయక్రాంతి): నాగారం మున్సిపాలిటీకి చెందిన అక్కల సురేష్ కుమార్, ఆధ్యాత్మికతపై తన అచంచలమైన భక్తిని చాటుకుంటూ, వరదరాజపురంలోని ప్రసిద్ధ శ్రీశ్రీశ్రీ బూనీలా సమేత వరదరాజస్వామి దేవస్థాన ఆలయ అభివృద్ధి పనుల కోసం తన వంతుగా లక్షా రెండు వేల రూపాయలు (1,02,000)విరాళాన్ని  ఆలయ చైర్మన్ ప్రొద్దుటూరి గోపాల కృష్ణకు అందించారు.

సుమారు 600 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ వరదరాజస్వామి దేవస్థానం అనేక దశాబ్దాలుగా భక్తుల కోరికలు తీరుస్తూ, విశేష పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో, ఆలయ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని సురేష్ కుమార్ నిర్ణయించుకున్నారు. విరాళం అందించిన అనంతరం అక్కల సురేష్ కుమార్ మాట్లాడుతూ, ‘మన దేవాలయాలను, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ప్రతి ఒక్కరూ ఆలయ అభివృద్ధి పనుల గురించి సహకరించాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఆయన దాతృత్వాన్ని ఆలయ చైర్మన్ ప్రొద్దుటూరి గోపాల కృష్ణతోపాటు ఆలయ కమిటీ సభ్యు లు, భక్తులు అభినందించారు.వరదరాజస్వామి అనుగ్రహంతో ఈ ఆలయం మరింతగా అభివృద్ధి చెంది, భక్తుల కోరికలు తీర్చే దివ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.