calender_icon.png 10 November, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ తీర్పుతో రేవంత్ కుర్చీ.. ఉంటదో.. ఊడుతదో!

10-11-2025 01:06:40 AM

  1. కత్తి మాకివ్వండి.. బుల్డోజర్‌కు అడ్డంగా నిలబడుతాం
  2. రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అన్న ఓవైసీ ఇప్పుడు ఎందుకు మద్దతిస్తున్నారు?
  3. యూసుఫ్‌గూడ రోడ్ షోలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఇచ్చే షాక్‌తో సీఎం రేవంత్‌రెడ్డి కుర్చీ మూడేళ్లు ఉంటుందో, మూడు నెలలు ఉంటుందో తేలిపోతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కడితే, కేవలం 500 రోజుల్లోనే కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ‘ఇవాళ సీఎం మీట్ ది ప్రెస్ పెట్టి ఫ్రస్టేషన్ అంతా తీసుకుంటుండు.

జూబ్లీహిల్స్‌లో గెలిచినా, ఓడినా 2034 దాకా ఆయనే సీఎం అట. రాసిపెట్టుకోండి.. కాంగ్రెస్ ఉంటది అంటుండు. నువ్వు గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి.. నవంబర్ 14న జూబ్లీహిల్స్ కొట్టే దెబ్బతో నీకు ఏమైతదో, నీ కుర్చీ ఉంటదో, ఊడిపోతదో యాదిపెట్టుకో. రేవంత్ రెడ్డి ఇచ్చే నాలుగు వేలు, ఆరు వేలకు ఆశపడితే మీరే మోసపోతరు, గోస పడుతరు. రెండేండ్ల కింద మోసపోయాం.. ఇప్పటికే అవస్థలు పడుతున్నాం. కుక్కర్లు పంచుతున్నారట. చీరలు పంచుతున్నారట.

పైసలు పంచుతున్నారట.. ప్రభుత్వాన్ని నడిపితే సీదా కొట్లాడు.. ఆ దమ్ము లేదు.. దిగజారిపోయి మాట్లాడుతున్నడు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ఓటు వేసే ముందు గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. పదేళ్ల కేసీఆర్ పాలనలో బస్తీ దవాఖానాలు, ఉచిత నీళ్లు, 24 గంటల కరెంట్‌తో మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నాం. కానీ ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి, ఉన్న ఇళ్లను హైడ్రా బుల్డోజర్‌తో కూలగొడుతున్నారు.

కత్తిని కాంగ్రెస్ కు ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా.. కత్తి మాకు ఇవ్వండి.. ఆ బుల్డోజర్‌కు అడ్డంగా వెళ్లి ఆపే బాధ్యత మాది’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎ న్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం యూసుఫ్‌గూడలో నిర్వహించిన భారీ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘తులం బంగారం, మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4వేల పెన్షన్..

ఒక్క హామీ అయినా అమలు చేశా రా? సొంత ఎమ్మెల్యేలకే నిధులు ఇవ్వలేని రేవంత్‌రెడ్డి.. జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తానంటే ఎలా నమ్మాలి? అమ్మకు అన్నం పెట్ట డు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓటెయ్య కపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తానని సీఎం చెబుతున్నారు. ‘పథకాలను రద్దు చేసేందుకు అది ఏమైనా నీ అయ్య సొమ్మా..? నీ అబ్బ సొమ్మా..?’ అని కేటీఆర్ నిలదీశారు.

ప్రజల సొమ్మును ప్రజలకు ఇవ్వకపోతే రేవంత్‌రెడ్డి గల్లాపట్టి యూసుఫ్‌గూడ నడి బజార్లకు గుంజి మీ పైసలు ఇప్పించే జిమ్మేదారి మాది అని కేటీఆర్ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను, బకాయిలు చెల్లించ కుండా రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అని, గాంధీభవన్‌ను మోహన్ భగవత్ నడిపిస్తున్నారని చెప్పిన అసదుద్దీన్.. ఇప్పుడు ఎందుకు ఆయనకు మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. 

4 లక్షల ఓట్లు.. 4 కోట్ల మందికి న్యాయం

4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు న్యా యం చేసే అవకాశం వచ్చింది అని కేటీఆర్ అన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ గెలుస్తుందని తెలియగానే, ఓటమి భయంతో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. ‘ఓడిపోతామనే భయంతోనే ఓటుకు డబ్బులు, కుక్కర్లు పంచుతున్నారు. పొరపాటున కాం గ్రెస్‌కు ఓటేస్తే, నేనేం చేయకపోయినా నాకే ఓటేశారు, ఇక హామీలు అమలు చేయాల్సిన అవసరం లేదు అని రేవంత్‌రెడ్డి అనుకుంటా డు.

పొరపాటున గెలిస్తే ఈ నేరచరిత్ర వారు మనల్ని బతకనిస్తారా..? భర్తను కోల్పోయిన మాగంటి సునీతను ఓడగొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్‌రెడ్డి. ఇప్పటివరకు 250 కోట్లు ఖర్చు పెట్టిండు. షేక్‌పే టలో 6 వేలు, యూసుఫ్‌గూడలో 5 వేలు, ఎర్రగడ్డలో 4 వేలు, బోరబండలో 6 వేలు ఇంటింటికి పంపుతున్నాడు. గమ్మత్తు ఏం టంటే ఈ డబ్బుల్లో కూడా కిందిస్థాయి నేత లు కమీషన్లు కొట్టి 2 వేలు ఇచ్చారట.

ఈ పైసలు నాలుగు రోజుల్లో అయిపోతాయి.. వీటి కోసం ఆలోచించొద్దు.. మీ జీవితం గురించి ఆలోచించండి’ అని కేటీఆర్ అన్నా రు. ‘అందుకే ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హామీలు అమలు చేయించుకుందాం’ అని పిలుపునిచ్చారు. దొంగ ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.