04-07-2025 12:00:00 AM
వివాదం కోర్టులో ఉండటంతో చర్యలకు అధికారులవెనుకడుగు
కరీంనగర్, జూలై 3 (విజయ క్రాంతి): నగునూరు భూ వ్యవహారం మళ్లీ తెరమీదికి వచ్చింది. వివాదంలో ఉన్న భూమిలో కొత్తగా ఖనీలు పాతారని ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు తొలగించేందు కు సిద్ధంకాగా ఈ వ్యవహారం కోర్టులు ఉండడంతో మళ్లీ వెనక్కి తగ్గారు. కరీంనగర్ కు ఆ నుకొని ఉన్న నగునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 330 నుంచి 410 వరకు ఉన్న స ర్వే నెంబర్లలో 315 ప్లాట్లు ఉన్నాయి.
గతం లో ఇందులో ఎక్కువ భాగం నయీం ము ఠా వెంచర్లను ఏర్పాటు చేసి విక్రయానికి సి ద్ధం కాగా అప్పట్లో నయీం మృతిచెందడం, భూమికి సంబంధించిన వారు కోర్టును ఆశ్రయించడంతో ఇక్కడి ఫ్లాట్లన్నీ పడావుగా పడి ఉన్నాయి. ప్లాట్లను విభజించి యజమానులు కొం దరు, అక్రమదారులు కొంద రు విక్రయించుకున్నారు. కోర్టులో ఉండడంతో ఇక్కడనిర్మాణాలు ఆగిపోయాయి.
కరీంనగర్ ను ఆనుకొని ఉండడంతో ఇక్కడి భూ మిపై అప్పట్లో కబ్జాదారుల కన్ను పడింది. ఇటీవల కరీంనగర్ జిల్లా కలెక్టర్ అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకట్టవేసి భూ కబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తుండడంతో నగునూరు తోపా టు చుట్టుపక్కల భూములపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే కరీంనగర్ రూరల్ తహసిల్దార్ కు ఇక్కడ కొత్తగా ఖనీలు పాతుకున్నారని, వా టికి రంగులు వేశారని, చెట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో గ్రామ కార్యద ర్శి ఈ స్థలాన్ని పరిశీలించి ఖనీలు తొలగించేందుకు సిద్ధం కాగా 28 ప్లాట్లతో ఉన్న ఒక సర్వే నెంబర్ లోని యజమానులు.
ఈ ప్రాంతానికి సంబంధించి కోర్టులో కేసు ఉందని తొలగించరాదని సూచించడంతో వెనకడుగు వేశారు. ఇటీవల రామడుగు మండలం దేశరాజుపల్లిలో సీలింగ్ భూము ల వ్యవహారం వెలుగులోకి రావడం, లోకాయుక్త ఆదేశంతో కొత్తపల్లి మండల పరిధిలోని 400కుపైగా ప్లాట్ల రిజిస్ట్రేషన్ కలెక్టర్ రద్దు చేయడంతో భూముల వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చినట్లయింది.
భూ కబ్జాదారులపై గత పోలీస్ కమిషనర్ కఠినంగా వ్యవహరించి అనేకమంది కబ్జాదారులను అరెస్టు చేసి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించారు. అయితే రియల్ ఎస్టేట్ పడిపో వడంతో క్రయ విక్రయాలు తగ్గిపోయాయి. ఇటీవల మళ్లీ ఈ రంగం ఊపందుకోవడంతో కబ్జాదారుల కన్ను పడడంతో నగునూరుతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు, కోర్టుల్లో ఉన్న భూములపై రెవెన్యూ యంత్రాంగం డేగకన్నువేసింది.