04-07-2025 12:21:16 AM
మణుగూరు, జూలై 3 (విజయక్రాంతి): మండల పరిధిలోని సమి తి సింగారం గ్రామ పంచాయతీలో గత కొన్ని రోజులుగా పేరుకుపోయిన చెత్త, ము రుగునీటి అధ్వానం ఎట్టకేలకు తొలగింది. ఇటీవల విజయక్రాంతులో ప్రచురితమైన పేరులోనే సింగారం..పారిశుధ్యంలో అధ్వానం అనే శీర్షికకు మండల పంచాయతీ అధికారి పలనాటి వెంకటేశ్వరరావు వెంటనే స్పందించారు. ఆయన ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి దూదిమె ట్ల శ్రీకాంత్ పారిశుద్ధ్యం తొలగింపు ఫై ప్రత్యేక దృష్టి సారించారు.
గురువారం ఆయన ఆధ్వర్యంలో సిబ్బందితో రాజీవ్ గాంధీనగర్, సాయి నగర్, ఎన్టీఆర్ నగర్, అశోక్ నగర్ ఏరియాలలో రోడ్లపై ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, ప్రధాన వీధులను, మురికి కాలువలను శుభ్రం చేయించారు. పైపులైన్ లీకేజీలకు మరమత్తులను చేయించడంతో గ్రామంలో విచ్చలవిడిగా రోడ్లపై చెత్త కుప్పలను పారిశుద్ధ్య కార్మికులు తొ లగించి చెత్తను సేకరించి చెత్త ట్రా క్టర్ ద్వారా డంపుయార్డ్కు తరలించారు.
అనంతరం మురుగు కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి,దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రెయింగ్ తో పాటు నీటి గుంటల్లో ఆయిల్‌బాల్స్, డెంగ్యూ జ్వరాలను అరికట్టే విధంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ డబ్బాలు, టైర్లు తదితరాలను తొలగించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.