calender_icon.png 9 December, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

09-12-2025 05:29:01 PM

మోతె (విజయక్రాంతి): మంగళవారం మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కోల లింగయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల మద్దతుతో గెలిస్తే గ్రామంలో ఇప్పటికి పరిష్కారం కానీ ప్రతి పనిని స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకవెళతానని చెప్పారు. గ్రామ పంచాయతీ భవనం పాఠశాల భవనం సిసి రోడ్ల నిర్మాణంతో పాటు త్రాగునీటి సమస్య వీధిదీపాల సమస్యలు వేగవంతంగా పరిష్కారం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.