18 July, 2026 | 9:06 AM

నా పిల్లలకు తల్లి అవుతావా?

13-06-2024 12:50 AM

టెస్లా ఉద్యోగులతో ఎలాన్‌మస్క్ సరసాలు

నిత్యం మహిళా ఉద్యోగులకు వేధింపులు

సంచలనాలు బయటపెట్టిన వాల్‌స్ట్రీట్ జర్నల్

న్యూయార్క్, జూన్ 12: టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ ఏదో ఒకవిధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అనేక ఊహాగానాలు, కథనాలకు తావిస్తూ ఉంటుంది. తాజాగా ఆయనకు సంబంధించిన మరో వార్త వైరల్‌గా మారింది. స్పేస్‌ఎక్స్ కంపెనీలో పనిచేస్తున్న పలువురు మహిళలతో మస్క్ శారీర సంబంధం పెట్టుకొన్నారని వార్తలు గప్పుమన్నాయి. అందులో ఒక ఇంటర్నర్ (ట్రెయినీ ఉద్యోగి) కూడా ఉన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీల్లో మహిళలకు ఏమాత్రం సౌకర్యంగా లేని వాతావరణాన్ని మస్క్ సృష్టించాడని విమర్శించింది.

కంపెనీ బోర్డు సమావేశాలకు కూడా మస్క్ ఎల్‌ఎస్‌డీ, కొకైన్, ఎక్‌స్టెసీ వంటి మాదకద్రవ్యాలు స్వీకరించిన వస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల్లో మహిళా ఉద్యోగుల పరిస్థితులపై వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. ఆ కంపెనీల్లో పనిచేసిన మాజీ మహిళా ఉద్యోగులు వెల్లడించిన విషయాలు పొందుపరిచారు. ఈ కంపెనీల్లో మాటలతో లైంగికంగా వేధించటం సర్వసాధారణ విషయమ ని, ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోరని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు.

2016లో స్పేస్ ఎక్స్‌లో పనిచేసిన ఓ మహిళా ఫ్లుటై అటెండెంట్ తనకు ఎదురైన ఘటన వివరించా రు. ‘నా ముందు మస్క్ తన దుస్తులు విప్పే సి అసభ్యంగా ప్రవర్తించారు. నాతో లైంగిక సంబంధం పెట్టుకొంటే ఓ గుర్రాన్ని కొనిస్తానని ఆఫరిచ్చాడు’ అని తెలిపారు. 2013లో ఆ కంపెనీలో ఉద్యోగం మానేసిన మరో మహిళా ఉద్యోగి.. ‘నా పిల్లలకు తల్లి అవుతావా? అని మస్క్ అనేకసార్లు అడిగారు’ అని చెప్పారు. ఓ మహిళా ఉద్యోగితో మస్క్ సాగించిన అభ్యంతరకర చాటింగ్ వివరాలను ఆమె బహిర్గతం చేశారు.