మీరు కుమ్కక్కు మాపై బురద చల్లుతారా?
- డ్రగ్స్, ఈ-ఫార్ములా రేసు కేసులో కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
- సీఎంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపాటు
కరీంనగర్, మార్చి 20 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌తో తాను కుమ్కక్కయ్యానంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. కరీంనగర్‌లోని మమత థియేటర్‌లో కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, జిల్లా అధ్యక్షులు గంగా డి క్రిష్ణారెడ్డి సహా బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ శుక్రవారం “దురంధర్ 2” సినిమాను వీక్షించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డ్రగ్స్ కేసుపై విచారణ చేసి, అకున్ సబర్వాల్ నివేదిక ఇచ్చారు కదా? డ్రగ్స్ సూత్రధారులెవరో ఆ రిపోర్ట్‌లో ఉంది కదా? మరి ఆ రిపోర్ట్ ఏమైంది? ఎందుకు బయటపెట్టడం లేదు? డ్రగ్స్ సూత్రధారులను అరెస్ట్ చేయకుండా, కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయ కుండా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఒకరిద్దరిని పట్టుకుని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్‌రావును విదేశాలకు పారిపోయేలా చేసింది మీరు కాదా? అంటూ నిలదీశారు.




