14 July, 2026 | 3:13 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

కార్పొరేట్ల సంపద పెంపుకు కోట్లాదిమంది కార్మికుల గొంతుకు ఉరి బిగిస్తారా?

02-04-2026 12:00 AM
  1. నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయవద్దు

కలెక్టరేట్ వద్ద బ్లాక్ డే నిరసనలో కార్మిక సంఘాల నాయకుల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఏప్రిల్ ఒకటి నుండి దేశం లో నాలుగు లేబర్ కోడ్లను అమలుచేయాలని మోడీ ఆదేశాలు ఇవ్వడం కార్మిక వ్యతిరేకమైనదని,కార్పొరేట్ల సంపద పెంపుకోసం 145 కోట్ల దేశప్రజలకు,70 కోట్ల కార్మికుల గొంతుకు ఉరితాడు బిగించడానికి సిద్ధం కావడం దుర్మార్గమైoదని కార్మిక సంఘాల నేతలు ఎస్ ఏ.జలీల్,జే.సీతారా మయ్య,కంచర్ల జమలయ్య ,దొడ్డా రవికుమార్,షేక్.యాకుబ్ షావలి అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.

యావత్తు కార్మిక వర్గం లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మెలను నిర్వహించి తమ వ్యతిరేక త తెలియజేసినప్పటికీ మోడీ ప్రభుత్వం కార్మిక ప్రయోజనాల కన్నా అంబానీ,అదాని లాంటి పిడికెడు మంది కార్పొరేట్ల, పెట్టుబడి దారులకు సంపదలను కట్ట బెట్టటమే లక్ష్యంగా లేబర్ కోడ్లను అమలు చేయటాని కి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. బ్లాక్ డే లో భాగం గా బుధవారం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐఎన్ టియుసి ఐఎఫ్ టియు,సిఐటియు,ఎ ఐటియుసి,టియుసిఐ సంఘాల నాయకులు ప్రసంగించారు.