14 July, 2026 | 4:01 PM

Breaking News

ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •  

అక్రమాలకు పాల్పడిన జీసీసీ ఉద్యోగి సస్పెన్షన్

02-04-2026 12:00 AM

ఉత్తర్వులు జారీ చేసిన ఐటీడీఏ పీవో

ఉట్నూర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉట్నూర్ డివిజన్ పరిధిలోని ఆదిలాబాద్ సొసైటీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రాథోడ్ గణేష్ ను సస్పెండ్ చేస్తూ ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మట్ తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని జీసీసీ డి.ఆర్ డిపో ఇన్చార్జిగా ఉన్న రాథోడ్ గణేష్ పై పలు ఆరోపణలు రావడంతో పాటు ఇటీవల పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేయగా 6.63 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు.

ఈ మేరకు గణేష్ పై పౌరసరఫరాల చట్టం ప్రకారం, డిపో ను సీజ్ చేసి, 6ఏ కేసు నమోదు చేశారు. వీటిని తీవ్రంగా పరిగణించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ జీసీసీ సీనియర్ అసిస్టెంట్ రాథోడ్ గణేష్ ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు.