13-07-2025 12:24:20 AM
లండన్, జూలై 12: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ విజేతగా పోలండ్ స్టార్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 8వ సీడ్ స్వియాటెక్ 6-0, 6-0తో అమెరికాకు చెందిన 13వ సీడ్ అమండా అనిసిమోవాపై సునాయస విజయాన్ని అందుకుంది. గంట లోపే ముగిసిన మ్యాచ్‌లో స్వియాటెక్ తన ప్రత్యర్థిపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించింది.
కాగా స్వియాటెక్‌కు ఇదే తొలి వింబుల్డన్ కావడం విశేషం. గతంలో ఫ్రెంచ్ ఓపెన్‌ను నాలుగుసార్లు నెగ్గిన స్వియాటెక్ ఒకసారి యూఎస్ ఓపెన్ నెగ్గింది. తాజాగా సాధించిన వింబుల్డన్‌తో స్వియాటెక్ తన కెరీర్‌లో మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించినట్లయింది. ఆదివారం జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కారాజ్‌తో జానిక్ సిన్నర్ తలపడనున్నాడు.