calender_icon.png 12 July, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు

12-07-2025 12:18:29 AM

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణలో మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల్లోని 607 పోస్టులకు ఈ నెల 10 నుంచి 17వ తేదీల్లో దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా, డాక్టర్ల విజ్ఞప్తి మేరకు ఈ తేదీల్లో మార్పులు చేశా రు.

ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనను మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బో ర్డు విడుదల చేసింది. బోర్డు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూ చించింది. దరఖాస్తు సమయంలో బోర్డు వెబ్‌సైట్‌లో అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల ధృ వీకరణ తదితర సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి కొంత సమయం కావాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.